Malli Nindu Jabili May 20: కాంచనకు మల్లి కి అరవింద్ కట్టిన తాళి దొరుకుతుంది. ఈ తాళి ఎవరిది అని అరవింద్ మాలిని పెళ్లి రోజు ఫంక్షన్ కి వొచ్చిన అందరిని అడగే సీన్ తో మొదలవుతుంది మల్లి నిండి జాబిలి మే 20 ఈ రోజు ఎపిసోడ్ E361. మా ఇంట్లో ఎవరిదీ కాదండి అని సమాధానం చెబుతుంది అనుపమ. ఇక మరి ఈ రోజు కథలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి ఇప్పుడు చూద్దాం.

ఇలాంటి పరిస్థిథి ఏ భార్యకు రాకూడదు
కాంచన తాళి గురించి ఎవరిది అని అడగటం తో ఆందోళనలో కనపడతారు మాలిని ఇంకా అరవింద్. ఇలాంటి పరిస్థిథి ఏ భార్యకు రాకూడదు, అయినా తాళిని జాగర్తగా పెడతాను అని తీసుకున్న మాలిని ఇలా చేసింది ఏంటి అని మనసులో అనుకుంటాడు అరవింద్. స్టేజి పైకి ఎక్కిన కాంచన ‘మూడు అంకెలు లెక్క పెడతాను చెప్తే మంచిది లేదు అంటే ఏ అమ్మవారి కాళ్ళ దెగ్గరో పెట్టస్తాను’ అని అంటుంది. అరవింద్ మల్లిని కాపాడటానికి ఆ తాళి తనదే అని చెప్తుంది రూప. అది చూసి అందరూ షాక్ లోకి వెళ్లినట్లు మనకు కనపడుతుంది.

Malli Nindu Jabili: అరవింద్ మల్లి ని కాపాడిన రూప
రూప ఆ తాళి నాదే అని అబద్ధం చెప్తుంది. ఇందాకటి నుంచి అడుగుతుంటే అంత సైలెంట్ గ ఉన్నావ్ మరి అని అడుగుతుంది కాంచన, దానికి బదులుగా నా కారణాలు నాకు ఉన్నాయి అని అంటుంది రూప. ఏంటి ఆ కారణాలు అని కోపంగా నిలదీస్తుంది కాంచన. మీ అయన అంటే నీకు ఇష్టం లేదా మీ అయన అంటే గౌరవం లేదా నీకు అని దొరికిన తాళిని ఉద్దేశించి రూపను అడుగుతుంది కాంచన. ఆడది తాళిని తాళి కట్టిన వారిని గౌరవించనప్పుడు ఇంకా ఆడదానికి విలువ ఏముంటుంది అని గొడవ చేస్తుంది. రూప ఎందుకు తాళి తనది అని అబద్ధం చెప్పింది అని అనుమానం వొస్తుంది మాలినికి.

కాంచన నోరు మూయించిన మల్లి
కాంచన ఆలా విచ్చలవిడిగా రూపను తిడుతుంటే తట్టుకోలేక పోతుంది మల్లి. కాంచన అమ్మ గారు ఇంకా ఆపండి, రూప అమ్మగారిని ఇంకోక మాట అంటే ఇక్కడ ఉన్న ఎవరు ఊరుకోరు అని హెచ్చరిస్తుంది మల్లి. రూప అమ్మగారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని మల్లి అనడం తో కోపం తో ఊగిపోతోంది కాంచన. అన్నయ్య ఈ పిల్ల చూడు నన్ను ఎంత మాట అంటుందో అని మల్లి మీద శరత్ కు ఫిర్యాదు చేస్తుంది. అనిపించుకున్నది నువ్వే కదా అని కాంచనను తిడతాడు శరత్. చూడండి కాంచన గారు మీరు శరత్ గారి చెల్లలు అని మీకు గౌరవం ఇస్తాము ఆలా అని నా కూతురు గురించి ఇష్టం వొచినట్లు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు అని రూప తండ్రి హెచ్చరిస్తాడు. పక్కన వసుంధరతో ‘ఎలా బయట పడిందో అర్ధం కావట్లేదు అమ్మ’ అని మాలిని అంటుంది.

రూపకు తెలుసు అని తెలుసుకున్న మాలిని
కొంచెం సేపటి తరువాత అరవింద్ మల్లి కలిసి బయట పెరట్లో ఉన్న రూప దెగ్గరకు వెళ్తారు. మల్లిని చూసి రూప ఇలా అంటుంది ‘ఇది నీది అని అర్ధం అయింది మల్లి, అక్కడ విషయం బయట పడకుండా ఉండడానికి ఇది నాది చెప్పాను’. అయితే కథలో మలుపు ఏంటి అంటే రూప మల్లి అరవింద్ తో ఈ విషయం మాట్లాడటం మొత్తం వినేస్తుంది మాలిని. రూపకు నిజం తెలుసు అని తెలుసుకున్న మాలిని మొఖం బాధ కోపం తో షాక్ లో కనపడటం మనం చూస్తాము. వదినకు కూడ మల్లి అరవింద్ పెళ్లి గురించి తెలుసు అన్నమాట అని మనసులో అనుకుంటుంది మాలిని. రూప తాళి తిరిగి ఇవ్వగానే కళ్ళకు అద్దుకొని తిరిగి మెడలో వేసుకుంటుంది మల్లి.

Malli Nindu Jabili: మళ్ళీ చిగురించిన అరవింద్ మాలిని ప్రేమ?
తరువాత సీన్ లో మాలిని అరవింద్ స్టేజి పైన ఉన్న ఆసనం మీద కలిసి కూర్చును ఉంటారు. ఒకరి మొఖం ఒకరు చూసుకున్నప్పుడు, పాత జ్ఞపకాల వలన వారి మధ్య ప్రేమ మల్లి చిగురించిందా చూసే వారికీ అనుమానం కలిగేలా ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఇది చూసిన అక్కడ కుటుంబ సభ్యులు అందరి మొఖం ఆనందంతో వెలిగిపోతాయి.
ఆలస్యంగా అక్కడికి వచ్చిన మీరా…కథలో కీలక మలుపు
మొత్తానికి చాలా రోజులుగా జరుగుతున్న పెళ్లి రోజు డ్రామా ఈ రోజు ఎపిసోడ్ లో కీలక మలుపు తిరుగుతుంది. ఫంక్షన్ చాలా బాగా జరిగింది అని ఒక పక్క మాలిని ఆనందంగా ఉండగా, ఫంక్షన్ మొత్తం అయిపోయిన తరువాత ఆలస్యంగా అక్కడికి వస్తుంది మల్లి అమ్మ మీరా. అక్కడకు వొచ్చిన మీరాను చెయ్యి పట్టుకుని పెరట్లోకి లాక్కు వొస్తుంది వసుంధర. మల్లి ఇంట్లో వసుంధరను చూసి భయం ఇంకా ఆందళోనకు గురవుతుంది మీర. కొంచెం సేపటి తరువాత ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని వసుంధరను నిలదీస్తుంది మీర. మరి నన్ను 20 ఏళ్లగా ఇబ్బంది పెడుతున్న నిన్ను ఎమ్ చేయాలి అని గట్టిగా అరవడం మొదలు పెడుతుంది వసుంధర. ఆ తరువాత వసుంధరకు శరత్ మీరాల సంబంధం గురించి తెలిసిపోయింది అని మీరకు అర్ధం అవుతుంది. నీ వల్ల నేను ఇబ్బంది పడినట్లు ఇప్పుడు నీ కూతురి వలన నా కూతురు ఇబ్బంది పడుతుంది అని వసుంధర అనడం తో అర్ధం కానట్లు మొఖం పెడుతుంది మీర. టైం వొచ్చినప్పుడు నీకే తెలుస్తుంది, గొప్పింటి వాడిని వలలో వేసుకుంటే డబ్బులు బాగా రాబట్టొచ్చు అని తల్లి కూతురులు ప్లాన్ చేసుకుంటున్నారా అని ఇష్టం వొచ్చినట్లు తిడుతుంది వసుంధర.

మీ గురించి ఇప్పుడే ఇక్కడే ఈ క్షణం అందరిముందు చెప్పస్తాను అని మీరను బెదిరిస్తోంది వసుంధర. వొద్దు అని బ్రతిమిలాడుతూ వసుంధర కాళ్లు పట్టుకుంటుంది మీర. దయచేసి నా మల్లికి నిజం చెప్పకండి అమ్మ అంటూ ప్రాధేయపడుతుంది. ఇంతలో ఈ గొడవ విను అరవింద్ కుటుంబ సభ్యులు ఇంకా శరత్ అందరూ బయటకి వస్తారు. మీర వసుంధర కాళ్ళు పట్టుకుని ఏడవటం శరత్ చూస్తాడు. ఇక తరువాత ఎం జరుగుతుందో తెలియాలి అంటే సోమవారం రోజు విడుదలయ్యే మల్లి నిండు జాబిలి కొత్త ఎపిసోడ్ వొచ్చే వరకు ఎదురుచూడక తప్పదు. మల్లి నిండు జాబిలి కొత్త ఎపిసోడ్స్ స్టార్ మా తో పాటు డిస్నీ+ హాట్ స్టార్ లో ఇక్కడ చూడవొచ్చు.