Radha Manoharam: ప్రస్తుత కాలంలో సీరియల్స్ కి ఏ విధమైన హడావిడి పెరిగిందో మనందరం చూస్తూనే ఉన్నాం. నిత్యం ఏదో ఒక కొత్త సీరియల్ అనౌన్స్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక ఈ తరుణంలోనే సీరియల్ ఛానల్స్ కి కూడా గట్టి పోటీనే ఎదురవుతుంది. మంచి మంచి సీరియల్స్ అందిస్తూ తమ ఛానల్ ని టాప్ వన్ పొజిషన్లో నిలబెట్టాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. కానీ కొందరు మాత్రమే అటువంటి కాన్సెప్ట్ లు అందించగలుగుతున్నారు. అలా అందించిన ఛానల్స్ లో స్టార్ మా ముందుంటుంది. ఒకప్పుడు స్టార్ మా చాలా వీక్ గా ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం స్టార్ మా అందించే సీరియల్స్ మరే ఛానల్ అందించడం లేదని చెప్పుకోవచ్చు.
స్టార్ మా లో ప్రసారమైన కార్తీకదీపం మరియు బ్రహ్మ ముడి వంటి సీరియల్స్ కి ఇప్పటికే భారీ టీఆర్పి రేటింగులు దక్కుతున్నాయి. ఇక ఇప్పుడు కార్తీకదీపం కి సీక్వెల్ కూడా రావడంతో ఈ సీరియల్ టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక గత కొన్న సంవత్సరాలుగా టాప్ టిఆర్పి రేటింగ్ లో ముందుంటుంది స్టార్ మా. అనంతరం రెండవ ప్లేస్ ని జీ తెలుగు కొట్టేయగా మూడవ ప్లేస్ లో జెమినీ టీవీ నిలిచింది. ఒకప్పుడు మంచి మంచి కాన్సెప్ట్ లో అందిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈటీవీ మాత్రం ఈ మధ్యకాలంలో అస్సలు తన జోరు చూపించడం లేదు.
ఏదో అడపా దడపా కాన్సెప్ట్లతో ప్రేక్షకుల ముందుకి వచ్చినప్పటికీ వాటితో ఎవరిని ఆకట్టుకోలేక పోతుంది. ఈ క్రమంలోనే ఈ ఛానల్ టిఆర్పి రేటింగ్ భారీగా పడిపోయింది. దీంతో స్టార్ హీరో మరియు హీరోలు కూడా తమ సినిమాని స్టార్ మా లేదా జీ తెలుగు లో వరల్డ్ వైడ్ గా స్ట్రీమింగ్ చేయడానికి ముందుకొస్తున్నారు కానీ ఈటివి అయితే అసలు మగ్గుచూపడం లేదు. ఇక అలాంటి ఈ ఛానల్ తాజాగా సరికొత్త సీరియల్ ని ప్రకటించింది. ఆ సీరియల్ పేరే రాధా మనోహరం. ఈ సీరియల్లో సీరియల్ యాక్టర్ సిద్దు హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ విషయానికి వస్తే రావోయి చందమామ సీరియల్లో నటి నటిస్తుంది.
ఇక వీరిద్దరి కాంబినేషన్లో మొట్టమొదటిగా ఈ సీరియల్ రానుంది. అగ్గిపై ప్రమాణం చేస్తున్న ఫోటో ఒకటి షేర్ చేస్తూ ఈ సీరియల్ ని ప్రకటించారు ఈ టీవీ వారు. మరి ఈ సీరియల్ తో అయినా ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతారో లేదో చూడాలి. ఒకవేళ కనుక ఈ సీరియల్తో ఈటీవీ వారు మంచి గుర్తింపు పొందితే రానున్న రోజుల్లో స్టార్ మానే ఢీకొడుతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సీరియల్లో హీరోగా నటిస్తున్న సిద్దు మనందరికీ బాగా సుపరిచితం. అందువల్ల ఈ సీరియల్ పై ప్రతి ఒక్కరూ లుక్కేస్తున్నారు. ఇక కాన్సెప్ట్ బాగుంటే ఈ సీరియల్ ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. అలా ఆదరించి రానున్న రోజుల్లో భారీ టిఆర్పి దక్కించుకుంటుందో లేదో చూడాలి.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!