Serial Actor Bhavana: సీరియల్ యాక్టర్స్ భావన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. గతంలో అనేక సీరియల్స్ లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కొంచెం హుషారు తగ్గించింది. యమలీల వంటి సీరియల్స్ లో తన అందం అభినయంతో ప్రతి ఒక్కరిని మైమరిపించింది భావన. ఈ ముద్దుగుమ్మ చాలా చిన్న వయసులోనే బాలనాటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అనంతరం ఎన్నో సినిమాల్లో తన సత్తా నిరూపించుకుంది. హీరోలకి సిస్టర్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తిరుగులేని స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాల విషయానికి వస్తే… కన్యాదానం, క్షత్రియ పుత్రుడు వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు తమిళంలో కూడా పలు సినిమాల్లో నటించి బాగా పాపులారిటీ సంపాదించుకుంది.
ఈమెకి మూవీస్ లో కంటే సీరియల్స్ లోనే ఎక్కువ పాపులారిటీ దక్కింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈటీవీలో ప్రసారమైన అందం సినిమాతో ఈమెకి భారీ పాపులారిటీ దక్కింది. రమ్య క్యారెక్టర్ లో నటించిన భావన ఈ సీరియల్ తో సీరియల్ యాక్టర్ గా మంచి గుర్తింపు పొందింది. ఇక ఈమె నటించిన సీరియల్స్ విషయానికి వస్తే.. అందం, నా మొగుడు నాకే సొంతం, ప్రియమైన శత్రువు, కర్తవ్యం, పుత్తడి బొమ్మ ఇలా ఎన్నో సీరియల్స్ లో నటించింది భావన. ఇక ఈమెకి డాన్స్ అంటే చాలా ఇష్టం. బీట్ కి తగ్గ స్టెప్పులు వేస్తూ తన డాన్స్ అదరగొడుతుంది. భావన పలు డాన్స్ కార్యక్రమాలలో కూడా పాల్గొని సందడి చేసేది.
ఇక ఈ ముద్దుగుమ్మ పర్సనల్ విషయానికి వస్తే.. భర్త పేరు విజయ్ కృష్ణ. వీరిద్దరిది ప్రేమ వివాహం. ఇక ఈ దంపతులకు ప్రస్తుతం ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మించారు. భావన భర్త విజయ్ కృష్ణ సీరియల్ డైరెక్టర్. కథలో రాజకుమారి వంటి సూపర్ హిట్ సీరియల్స్ కి దర్శకత్వం వహించాడు. అదేవిధంగా రీసెంట్ గా మొదలై మంచి ప్రేక్షక ఆదరణ దక్కించుకున్న గృహలక్ష్మి సీరియల్‌కి కూడా ఈనే డైరెక్షన్ వహించారు. ఇక ప్రస్తుతం వరుస సీరియల్స్‌ను డైరెక్ట్ చేయడమే కాకుండా సినిమాలను కూడా డైరెక్ట్ చేయాలనే ఆశతో ఉన్నాడు భావన హస్బెండ్. ఇక భావన హస్బెండ్ కి ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయట.
ఈ క్రమంలోనే సినిమాలను డైరెక్ట్ చేసేందుకు మగ్గు చూపుతున్నాడు. మరి రానున్న రోజుల్లో భావన హస్బెండ్ సినిమాలను డైరెక్ట్ చేసి ఎంత మేరా పాపులారిటీ సంపాదించుకుంటాడు చూడాలి. ఏదేమైనా ఒకప్పుడు సినిమాల్లో నటించి ప్రస్తుతం సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందుతున్నారంటే అదంతా సీరియల్స్ మహిమ అనే చెప్పుకోవచ్చు. గతంలో భావన అనేక సినిమాల్లో మరియు స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ పెద్దగా ఎవరు గుర్తించలేదు. కానీ అలా సీరియల్స్ లో నటించిందో లేదో ఇలా గుర్తించడం మొదలుపెట్టారు. అంత లాగా క్రేజ్ పెరిగింది మరి సీరియల్స్ కి. మరి రానున్న రోజుల్లో ఈ ముద్దుగుమ్మ ఏమైనా సినిమాల్లో అడుగుపెడుతుందో లేదో చూడాలి.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!