Telugu TV Serials

ఈరోజు ఎపిసోడ్ సూపర్ … తన నటనతో అందరిచే కంటతడి పెట్టించిన ఇగో మాస్టర్….!!

Share

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ 545 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు సెప్టెంబర్ 2 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. వసు చివరి పరీక్ష రాయకూడదనే ఉద్దేశ్యంతో సాక్షి కుట్ర చేసి వసును కిడ్నాప్ చేసి ల్యాబ్ లో బందిస్తుంది.. వసు కోసం రిషి, గౌతమ్, జగతి, మహేంద్ర వెతుకుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి. ఈరోజు ఎపిసోడ్ లో ఇగో మాస్టర్ తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి.. వసు కోసం మహేంద్ర జగతిలు కాలేజీకి వస్తారు. అప్పటికే గౌతమ్ కాలేజ్ బయట అంతా వెతికి ఎక్కడా కనిపించలేదని అంటాడు. రిషి కూడా కాలేజ్ అంతా వెతికి ఎక్కడ కనిపించలేదు అని చెప్పడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు..

వసు కోసం టెన్షన్ పడుతున్న రిషి, జగతి, మహేంద్ర, గౌతమ్:

రేపే చివరి పరీక్ష ఒకవేళ వసు పరీక్ష రాయకపోతే తన జీవితమంతా అయిపోయినట్టే అని బాధపడతారు జగతి, మహీంద్రలు.అప్పుడు గౌతమ్, వసుధార ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది భయపడంపోవధ్దు అని అంటాడు.క్షేమంగా ఉండడం కాదురా రేపు తను పరీక్ష ఎలాగైనా రాయాలి అని రిషి అంటాడు. అసలు వసుకు ఏమైంది? ఎక్కడ లేదు, రేపు ఉదయానికి వచ్చేస్తుంది లెండి మనం అంతకుమించి ఏం చేయగలము రేపు పరీక్ష కదా చీకటి పడింది అని ఇంటికి వెళ్తారు అందరూ.రిషి మాత్రం నేను ఇంటికి రాను కాలేజ్ గెస్ట్ హౌస్ లో ఉంటాను. వసుధార తోనే మళ్లీ తిరిగి ఇంటికి వస్తాను అని అంటాడు. ఆరోజు రాత్రికి అక్కడే పడుకుంటాడు రిషి.

వసు జాడ తెలుసుకున్న రిషి :

ఆ తర్వాత రోజు ఉదయం లేచి వసుకి ఫోన్ చేస్తాడు.ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంతలో జగతి, మహేంద్రాలు అక్కడికి వచ్చి వసు గురించి అడుగుతారు ఇంకా ఏం తెలియలేదు అని అంటాడు రిషి. ఇంతలో పుష్పా అక్కడికి రాగానే వసుదార గురించి ఏమైనా తెలిసిందా అంటే లేదు అంటుంది పుష్ప.ఇంతలో  పరీక్షకి టైం అవుతుంది అని చెప్పి జగతి మహీంద్రాలు దానికి ఏర్పాట్లు చూస్తారు. అప్పుడు రిషి బాధపడుతూ మనసులోనే అల్లాడిపోతు ల్యాబ్ బయటకి అలా నడుస్తూ వస్తాడు.అక్కడ రిషికి తాను ఇచ్చిన రంగుల. గోళీలు కనపడతాయి. ఇవి వసుధరవే అని అనుకోని ఆ బాల్స్ పడిపోయిన దిక్కులో వెళ్తూ ఉంటాడు అలాగా రిషి ఆ ల్యాబ్ లోని ఒక రూం లోకి వెళ్లి చూడగా అక్కడ వసు కిందపడి ఉంటుంది.


వసు కోసం రిషి పడే తపన సూపర్ :

రిషి వెంటనే వసుని ఎత్తుకుని సోఫాలో కూర్చోపెట్టి. డాక్టర్ ను పిలవమని గౌతమ్ తో చెప్తాడు.ఇక రిషి మాత్రం మత్తుగా ఉన్నా వసును లెగు వసుధార నువ్వు చివరి పరీక్ష రాయాలి..రాయగలవు.నువ్వు ఇంతవరకు చేరుకుని చివరి నిమిషంలో వదిలేస్తే ఎలా..నువ్వు మాలాగే లెక్చరర్ అవుతావు అది నీ కల.ఈ పరీక్ష రాయకపోతే అది జరగదు అని అంటాడు రిషి.

వసు భవిష్యత్తు గురించి బాధ పడుతున్న జగతి :

మరో వైపు జగతి  క్లాసులో పేపర్స్ పంచుతూ ఇంక వసు రానట్లేనా.. అయ్యో తన జీవితమంతా అయిపోతుందా అని బాధపడుతూ ఉండగా వసు వచ్చి మేడం క్వశ్చన్ పేపర్ ఇవ్వండి అని అంటుంది.జగతి ఆనందంతో అక్కడికి వెళ్లి ఏమైంది వసు ఈ అవతారం ఏంటి అంటుంది.. సరే అవన్నీ తర్వాత ముందు పరీక్ష రయి.రాయగలవా అని అడగగా మాటిచ్చాను మేడం రాస్తాను అని అంటుంది.

వసు చివరి పరీక్ష రస్తుందా..తన గమ్యాన్ని చేరుతుందా..?

వసు మత్తులో ఉండడంతో రాస్తూ రాస్తూ కింద పడిపోతుంది.ఇంతలో రిషి అక్కడికి వచ్చి వసు కి మత్తుగా,మసక మసకగా ఉంటుంది. అని చెప్పడంతో వెంటనే జగతి మంచి నీళ్లు ఇచ్చి లేపుతూ ఉంటుంది. అప్పుడు వసు, నేను రాయాలి, నేను లెక్చరర్ అవ్వాలి మేడం ఇదే నా జీవితంలో నాకున్న లక్ష్యం నేను నా లక్ష్యాన్ని సాధించుకోవాలి అనుకోని పరీక్ష రాస్తుంది..ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Share

Related posts

ఇదేమి ట్విస్ట్ రా బాబూ…కార్తీక్ ను దాచేసింది ఆ మోనితేనా..??

Ram

Devatha Serial: మాధవ్ తో మీరు ఎన్ని కతలు బడిన ఇంట్లో నుంచి దేవిని తీసుకుని వెళ్తానన్న రాధ..!

bharani jella

Intinti Gruhalakshmi: సామ్రాట్ నందుతో తులసికి కాళ్లు మొక్కించాడు..! షాక్ లో లాస్య..!

bharani jella