Telugu TV Serials

తల్లడిల్లిన పేగు బంధం… దీప, సౌర్యలు కలుస్తారా..?

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1434 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఎపిసోడ్ ఆగస్టు 18 న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో. దీప, సౌర్య ఇద్దరు కలిసి ఒకే బస్ ఎక్కుతారు. మరోపక్క సౌందర్య వాళ్ళు ఇల్లు కాళీ చేసి వెళ్లే హడావుడిలో ఉంటారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.సౌందర్య తన ఇంట్లో. ఉన్న దీప, కార్తీక్‌ల ఫొటోలను గోడ మీద నుంచి తీసి.. పట్టుకుని వాటిని సర్దుతూ సౌందర్య ఎమోషనల్ అవుతుంది. ‘మీరు ఇద్దరూ మమ్మల్ని ఎలా వదిలి వెళ్లిపోగలిగారు’ అంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఇక హిమ అయితే.. సౌర్య ఫొటోని ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. దాంతో ఆనందరావు ‘సౌందర్య ఏడవకు. వాళ్లతో పాటు ఈ ఇంటితో కూడా రుణం తీరిపోయింది అనుకుందాం అంటూ ఓదారుస్తూ ఇల్లు వదిలి వెళ్ళిపోతారు.

ఒకే బస్ లో కలిసి ప్రయాణం చేస్తున్న దీప, సౌర్య:

ఇక దీప బస్ లో వెనుకే ఏడుస్తూ కూర్చుని ఉంటే దీపకు రెండు కుర్చీల వెనుక సౌర్య కూర్చుని అమ్మా నాన్నలను తలుచుకుని ఏడుస్తుంది.అమ్మా ఒక్కసారి కనిపించు అమ్మా అంటూ మనసులోనే అల్లాడిపోతుంది సౌర్య. ఆ బస్సు ఓ దాబా దగ్గర ఆగుతుంది. ‘అమ్మా ఏదైనా తినాలంటే దాబాలో తినండి’ అనేసి కండక్టర్ దిగుతాడు.దీప మాత్రం దిగదు. అంతా దిగిపోతారు. సౌర్య దిగి అలా బస్సు ముందు నుంచి దాబా దగ్గరకు వెళ్తుంది.  ఇక దీప దిగలేదని గమనించిన కండక్టర్.. ‘ఓ అమ్మా.. బస్సు హైదరాబాద్ వెళ్లేదాకా ఆగదు.. తిన్నా తాగినా ఇక్కడే’ అంటాడు. దాంతో దీప బస్సు దిగుతుంది.

సౌర్యకు వాటర్ బాటిల్ ఇచ్చిన దీప :

ఇక ఇంద్రుడు బన్ టీలో ముంచి సౌర్యకు తినిపిస్తూ ఉంటాడు. చంద్రమ్మ, ఇంద్రుడు కూడా టీ తీసుకుంటారు. దీప దిగి ఇటుగా నడిచి.. వస్తూ ఉండగా.. సౌర్యకు పొరమారి దగ్గు వస్తుంది. వాటర్ బాటిల్ అదే టీ స్టాల్‌లో అడిగితే ఉండదు. అప్పుడు దీపనే చంద్రమ్మకు వాటర్ బాటిల్ ఇస్తుంది. డబ్బులు అంటే వద్దమ్మా. బిడ్డకు అంటున్నారుగా.అడిగితే బిడ్డకు అమ్మ కొనిచ్చిందని చెప్పండి’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడుతుంది దీప.ఇక దీప.. కూడా మరో బాటిల్ కొనుక్కుని.. అక్కడ నుంచి వెళ్తూ.. సౌర్యని దాటుకుంటూనే వెనుక నుంచి వెళ్తుంది.

అమ్మకి థాంక్స్ చెపుతా అంటున్న సౌర్య:

చంద్రమ్మ పరుగున వచ్చి సౌర్యకు వాటర్ బాటిల్ ఇస్తుంది. వాటర్ తాగిన సౌర్య ‘ఒక్క బాటిల్ కొనుక్కుని రావడానికి ఇంత సేపా చంద్రమ్మా అంటాడు ఇంద్రుడు. ‘అది కాదు గండా వాడు చిల్లర లేదు అన్నాడు.. అప్పుడే ఒకమ్మ వచ్చి డబ్బులు ఇచ్చి బాటిల్ మనకి కొనిచ్చింది. అడిగితే అమ్మ కొనిచ్చిందని చెప్పమంది’ అంటుంది చంద్రమ్మ. ‘అవునా ఎవరు పిన్నీ ఆవిడా?’ అంటుంది సౌర్య. ‘మన బస్సేలేమ్మా చూపిస్తాను అంటుంది.ఇక అందరు కలిసి బస్ ఎక్కాక సౌర్య బాటిల్ కొనిచ్చింది ఎవరు? థాంక్స్ చెబుతాను’ అంటుంది చంద్రమ్మతో. వెనక్కి తిరిగి చూసిన చంద్రమ్మ దీప నిద్రపోవడం చూసి.. ‘నిద్రపోతుందిలేమ్మా.. దిగేప్పుడు చెబుదువుకానిలే’ అంటుంది.

తల్లడిల్లిన తల్లి పేగు :

కాసేపటికి సౌర్యకు నిద్ర వస్తుంది. దాంతో చంద్రమ్మ సౌర్యని ఒడిలో పడుకోబెట్టుకుని.. దుప్పటి కప్పుతుంది. ముఖం సగం వరకూ కప్పుకుని నిద్రపోతుంది సౌర్య. ఇక బస్ వచ్చి హైదరాబాద్ లో ఆగుతుంది. దీప దిగబోతుంటే సౌర్య చేయి దారికి అడ్డొస్తుంది. అది చూసిన దీప.. చంద్రమ్మ వైపు చూడగానే.. ‘నా బిడ్డ అమ్మా.. ఇందాక వాటర్ బాటిల్‌ తీసుకున్నందుకు థాంక్స్ చెప్పాలి అనుకుంది’ అంటుంది నవ్వుతూ. వెంటనే దీప.. సౌర్య చేయి పట్టుకుని పక్కకు జరిపేప్పుడు కన్నపేగు కదిలినట్లుగా అల్లాడిపోతుంది దీప. చంద్రమ్మ ఆ మాట అనగానే.. సౌర్య తలపై చేయి వేసి.. చాలా ప్రేమగా నిమురుతుంది. ఫర్వేలేదండి.. అనేసి దీప దిగిపోతుంది.

సౌందర్య ఇంటికి సౌర్యా:

ఇక సౌర్యని ఆటో ఎక్కించుకుని సౌందర్య ఇంటికి బయలుదేరతారు చంద్రమ్మ, ఇంద్రుడు. నిన్ను చూడగానే నీ వాళ్లు ఎగిరి గంతేస్తారు.. చాలా సంతోషిస్తారు అంటారు సోర్యతో.ఆపండి’ అన అరుస్తుంది సౌర్య కోపంగా. దాంతో ఆటో ఆగుతుంది. వెంటనే దిగి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంది సౌర్య. అమ్మా బంగారం.. ఆగు ఎక్కడికీ అంటే.. ‘మీరు నాకు అసలు పరిచయం కాలేదని అనుకోమన్నారు కదా.. నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకు.. అయినా ఇల్లు ఇల్లు అని నా ప్రాణం తీస్తున్నారు అంటూ ఏడుస్తుంది.ఇక ఎలాగోలా సౌర్యను కూల్ చేసి ఆటో ఎక్కించడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

 

 


Share

Related posts

Intinti Gruhalakshmi: ఆస్తి కోసం దిగజారిపోతున్న నందు.. అంకిత కోసం రానన్న అభి..!

bharani jella

Intinti Gruhalakshmi: తులసి చేతిలో చేయి వేసి ముందు నడిపించిన సామ్రాట్..! 

bharani jella

Devatha Serial: మాధవ్ తో ఆదిత్య నా పెనిమిటన్న రుక్మిణీ.. ఆదిత్య రుక్మిణీ, దేవిని తనతో తీసుకువెళ్తాడా.. 

bharani jella