NewOrbit
Telugu TV Serials

మోనితకు ఊహించని షాక్ ఇచ్చిన దీప..కార్తీక్ కు గుర్తొచ్చిన గతం..!

Share

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1456 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక. ఈరోజు సెప్టెంబర్ 12 న ప్రసారం కానున్న కార్తీకదీపం సీరియల్‌లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ నడుస్తుంది.గత ఎపిసోడ్ లో కార్తీక్ రోడ్డు మీద వినాయకుడి బొమ్మలు అమ్ముతున్న సౌర్యను చూసి చాలా జాలి పడతాడు.పక్కనే ఉన్న మోనితతో ఈ పాపని ఎక్కడో చూసినట్లుగా ఉంది కదా.? నీకేమైనా గుర్తుందా? అని అడగటంతో మోనితకి టెన్షన్ మొదలవుతుంది. ఇక సౌర్య కష్టపడడం చూసి తను అమ్ముతున్న వినాయకుడి బొమ్మలన్ని మోనిత చేత కొనిపిస్తాడు.

సౌర్య ఆలోచనల్లో కార్తీక్ :

Karthik, monitha

Advertisements

అదే సీన్ ఈరోజు కంటిన్యూ అవుతుంది. కార్తీక్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా సౌర్యనే తలుచుకుంటూ ఆలోచిస్తాడు. వెంటనే మోనితతో ఆ అమ్మాయిని మనం ఎక్కడా చూడలేదా?’ అంటాడు. ఇంకా ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తున్నావా కార్తీక్ అంటూ కొన్నా ఆ బొమ్మలన్నీ ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అంటూ కార్తీక్ ఆలోచనల్ని డైవర్ట్ చెయ్యాలని ప్రయత్నిస్తుంది మోనిత.ఏముంది ఒక్క బొమ్మ పూజలో పెట్టి మిగిలిన శివతో పంచిపెట్టేయించు అని ఇంకో విషయం మరిచిపోయాను మోనిత అని వంటలక్కను పూజకు పిలిచావా?’ అంటాడు.హ ‘పిలిచాను కానీ తను కూడా విగ్రహం అన్నీ తెచ్చుకుందట అక్కడే పూజ చేసుకుంటుందట అని చెబుతుంది మోనిత. మనసులో మాత్రం నువ్వు వచ్చి పిలిస్తేనే వస్తా అంది ఆ విషయం నీకు చెప్పనుగా అనుకుంటుంది. ‘అవునా సరే అయితే..’ అనేసి లోపలికి వెళ్లిపోతాడు. వెంటనే మోనిత మనసులో అమ్మయ్యా దీప ఇక ఇంటికి రాదు. కార్తీక్ తో కలిసి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనుకుంటుంది.

మోనితను కార్తీక్ ను దగ్గరగా చూసి కంటతడి పెట్టిన దీప:

Monitha, karthik

మరునాడు ఉదయాన్నే దీప తన అద్దె ఇంట్లో వినియకుడి పూజ ప్రారంభిస్తుంది నా భర్త నన్ను గుర్తు పట్టాలి లేదా ఆ మోనిత మీద నా డాక్టర్ బాబుకి నమ్మకం పోయేలా అయినా చెయ్యి స్వామీ అని ఏడుస్తుంది.మరోపక్క కార్తీక్ మోనితని పిలిచి ఈ పంచె కట్టుకోవడం రావట్లేదు కాస్త కట్టు అంటాడు. మోనిత హెల్ఫ్ చేస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే వచ్చిన దీప వాళ్ళను చూసి చాలా ఎమోషనల్ అయ్యి కళ్లనిండా నీళ్లతో అక్కడ నుంచి బయటికి అడుగుపెడుతుంటే శివ ఎదురవుతాడు. వెంటనే దీప శివా మీ సార్‌కి పంచె కట్టుకోవడం రావట్లేదు కాస్త వెళ్లి హెల్ప్ చేయమని అంటుంది.ఇక శివ లోపలికి వెళ్లి మీకు పంచె కట్టుకోవడం రావట్లేదంట కదా హెల్ప్ చేయమని వంటలక్క చెప్పింది అని కార్తీక్ కు హెల్ప్ చేస్తాడు.ఇక మోనిత మనసులో రానంది కదా? ఇప్పుడేంటీ? ఇలా వచ్చింది?అనుకుని సరేలే మేము కలిసి పూజ చేయడం చూసి ఏడుస్తుందిలే అనుకుంటుంది.

మోనితకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన దీప :

Monitha, deepw

ఇక పంతులు రాగానే మోనిత దీప దగ్గరకు వచ్చి రా వంటలక్కా ఎంతసేపు అయ్యింది వచ్చి మేము పూజలో కూర్చుంటున్నాం.చూద్దువులే అని అంటుంది వెటకారంగా. ఇక పూజలో మోనిత, కార్తీక్ కూర్చుంటున్న సమయంలో డాక్టర్ బాబు ఆగండి నాకు మాటిచ్చిన విషయం మరిచిపోయారా అంటుంది దీప.మీరు మరిచిపోతారనే మీ జేబులో స్లిప్ రాసుకుని పెట్టుకున్నారు?’ అంటుంది దీప.అవునా వంటలక్కా సరే ఆ స్లిప్ చూసి వస్తాను అని ఆ స్లిప్ తెచ్చి చదువుతాడు. పూజలో నేనొక్కడినే కూర్చోవాలి,నేను మాత్రమే పూజ చేస్తాను అంటూ అందులో ఉంటుంది.దానిని కార్తీక్ చదవగానే మోనితకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ‘కార్తీక్ ఏంటిది? దానికి నువ్వు మాటివ్వడం ఏంటీ? అని మండిపడుతుంది.అయ్యో మోనితా తప్పుగా అనుకోకు అని తను నన్ను మాత్రమే పూజలో కూర్చోమంది కానీ దేవుడ్ని ఏం కోరుకోమందో తెలిస్తే నువ్వు తిట్టవు తెలుసా అని నాకు నా భార్యకు మధ్య ఎవరు వచ్చినా నాశనం అయిపోవాలి.నేను నా భార్య సంతోషంగా కలిపి జీవించాలని మొక్కుకోమంది అని చెప్తాడు.అలా చెప్పందంటే తనెంత మంచిదో అర్థం చేసుకో అంటాడు. చూశావా ఆయన నీ పక్కనే కూర్చోకుండా ఎలా చేశానో అంటుంది దీప నవ్వుతూ.

గతం తాలుకు జ్ఞాపకాల్లో కార్తీక్ :

Karthik, deepa

ఇక అప్పుడే ‘డాక్టర్ బాబు మీరు ఇంతకు ముందు వినాయకచవితి ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యులతో చేశారేమో గుర్తు చేసుకోండి అంటుంది.కళ్ళు మూసుకుని తల పట్టుకుని ఆలోచిస్తాడు. నిజంగానే కార్తీక్‌కి అస్పష్టంగా గతంలో వినాయకచవితి చేసినప్పటి కొన్ని.సీన్స్ అన్నీ గుర్తొస్తాయి.వెంటనే మోనిత చాలు అని గట్టిగా అరుస్తుంది. కార్తీక్ కళ్లు తెరిచేస్తాడు అదే కార్తీక్ లేట్ అవుతుందిగా పూజ చెయ్ కార్తీక్ అని అంటుంది. పూజ పూర్తి అయ్యాక దీప వెళ్ళిపోతుంది.మోనిత వెళ్ళిపోగానే ఈ మాటలు ఇవ్వడం ఏంటీ కార్తీక్.. అసలు అసలు ఆ వంటలక్కని నువ్వు ఎప్పుడు కలిశావ్ అని అడగడంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది


Share

Related posts

Devatha: ఆదిత్య, రుక్మిణి రేపటికి సూపర్ ట్విస్ట్ ఇచ్చారుగా..! మాధవ్ ను తండ్రి కాదన్న చిన్మయి..!

bharani jella

ఆదిత్య ఇంటికి దత్తత వెళ్తానన్న దేవి.. చెస్ టోర్నమెంట్ లో దేవి కలవాలని మొక్కుకున్న దేవుడమ్మ..!

bharani jella

ఆదిత్య వాళ్ళింట్లో సత్యకు ఘోర అవమానం..! నాన్నతో మాట్లాడనని చెప్పిన దేవి..!

bharani jella