TV Actress Education: మన బుల్లి తెర నటీనటులు అందరూ కూడా మంచి చదువులనే చదివారు. కానీ వారికి యాక్టింగ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో నటన వైపుకు మగ్గు చూపారు. మొదట డాక్టర్ అండ్ లాయర్ అవ్వాలనుకున్న వారందరూ అనంతరం యాక్ట్రెస్ అయిపోయారు. అలా యాక్ట్రెస్ గా మారి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు కూడా. తమదైన నటనతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తూ వరుస సీరియల్స్ తో దూసుకుపోతున్నారు ఈ ముద్దుగుమ్మలు. ప్రస్తుత కాలంలో సినిమాల్లో నటించే హీరోయిన్స్ కి ఎంత పాపులారిటీ దక్కుతుందో తెలీదు కానీ సీరియల్స్ లో నటించే వారికి మాత్రం మంచి గుర్తింపు దక్కుతుంది. అందువల్లే చాలామంది నటీనటులు సీరియల్స్ లో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ఇక వారి పర్సనల్ లైఫ్ విషయాల్లో కూడా చాలా సీరియస్ గా ఉంటున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఎంత చదువునప్పటికీ బుల్లితెరపై యాక్టింగ్ చేసుకుంటూ ఉంటున్నారు. మరి మన బుల్లితెర నటీనటుల క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రియాంక జాన్:
జానకి కలగనలేదు మరియు మౌనరాగం వంటి సీరియల్స్ తో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రియాంక డిగ్రీ కంప్లీట్ చేసింది. ఇక ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా అడుగుపెట్టి మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.
2. పావన లాస్య:
మళ్లీ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బ్యాచిలర్ ఆఫ్ బిఎస్ఏ అడ్మినిస్ట్రేషన్ చదువుతుంది.
3. రక్ష గౌడ:
గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సైతం బ్యాచ్లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసింది.
4. దేబ్జాని మోదక్
ఎన్నెన్నో జన్మల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం సీరియల్స్ హీరోయిన్స్ లో టాప్ లో కొనసాగుతుంది.
5. కీర్తి:
మనసిచ్చి చూడు సీరియల్తో మంచి ఫేమస్ అయిన కీర్తి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసింది.
6. సిరి:
సావిత్రి అమ్మ గారి అబ్బాయి సీరియల్లో నటించిన సిరి హనుమాన్ ఎంబీఏ కంప్లీట్ చేసింది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది.
7. దాన్య దీపిక:
ఇంటికి ఇల్లాలు సీరియల్ లో నటిస్తున్న దాన్య దీపిక ఎంఎస్సీ పూర్తి చేసింది.
8. చైత్ర రాయ్:
ఈ ముద్దుగుమ్మ బ్యాచ్లర్ ఆఫ్ డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసింది.
9. ఆషిక పదుకునే:
త్రినయని సీరియల్ తో మంచి ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ బియి గ్రాడ్యుయేట్ ఐన్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసింది.
10. ఐశ్వర్య:
అగ్నిపరీక్ష వంటి సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఐశ్వర్య బిబిఎం కంప్లీట్ చేసింది.
అలా మన బుల్లితెర నటీనటులు బాగానే చదువుకున్నప్పటికీ తమ చదువుని పక్కన పెట్టి యాక్టింగ్ రంగంలో అనుభవాన్ని కలిగారు. ఒకవేళ వీరి కనుక చదువును నమ్ముకుని జాబ్స్ వైపుకి పరుగు పెడితే వీరికి ఇంత పాపులారిటీ వచ్చేది కాదనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ పది మంది హీరోయిన్స్ కి ఉన్న క్రేజ్ మరే స్టార్ హీరోయిన్ కి లేదు. సంవత్సరానికి ఒకసారి కనిపించే హీరోయిన్స్ కంటే రోజు కనిపించే హీరోయిన్స్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. ఇక రానున్న రోజుల్లో వీరందరూ మరిన్ని అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని వీరు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!