29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Horoscope Today's Horoscope in Telugu- Rasi Phalalu దైవం

Today Horoscope: మార్చి 17 – పాల్గుణమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope
Share

Today Horoscope: మార్చి 17 – శుక్రవారం – పాల్గుణమాసం – రోజు వారి రాశి ఫలాలు

మేషం
చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. సంఘంలో ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Today Horoscope
Today Horoscope

వృషభం
వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
మిధునం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వృత్తి వ్యాపారాల నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. మిత్రులతో ఆర్థిక విషయంలో విబేధాలు కలుగుతాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి.
కర్కాటకం
భూక్రయ విక్రయలు లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. గృహమున కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారమున నష్టాలు భర్తీ అవుతాయి.
సింహం
సోదరులతో గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. బందు మిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతనానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న కార్య సిద్ది కలుగుతుంది.
కన్య
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించటం మంచిది. చిన్ననాటి మిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆర్థిక వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి.
తుల
వృత్తి వ్యాపారాలు స్థిరంగా రాణించవు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు అధికమౌతాయి.
వృశ్చికం
వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు హోదాలు పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో దీర్ఘ కాలిక వివాదాల నుండి బయట పడతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనస్సు
కీలక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగమున విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
మకరం
ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు కలసివస్తాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉంటుంది. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగమున ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
కుంభం
నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అతి కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు.
మీనం
విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…

హైదరాబాద్ లో గంటల వ్యవధిలో రెండు భారీ అగ్ని ప్రమాదాలు


Share

Related posts

ఆగస్టు 6 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma

Tella Jilledu : ఇంట్లో తెల్ల జిల్లేడు చెట్టు ఉంటే ఇన్ని లాభాలా ?

siddhu

బ్రహ్మదేవాలయం ఎక్కడుందో మీకు తెలుసా ?

Sree matha