NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

మేము “ఆప”ము అంటున్న కేజ్రీవాల్..! అదేమిటో చూడండి..!!

 

ఆమ్ ఆద్మీ పార్టీ (అప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సమాజ సేవ కోసం ఉన్నత ఉద్యోగాన్ని త్యజించి రాజకీయాలలోకి వచ్చారు ఈ మాజీ ఐఆర్ఎస్ అధికారి అరవింద్ కేజ్రీవాల్. 2013 నవంబర్ లో పార్టీ స్థాపించిన అరవింద్ కేజ్రీవాల్ 13 నెలల్లోనే ఢిల్లీ అసెంబ్లీ లో అత్యధిక స్థానాలు సాధించి రికార్డ్ సృష్టించారు. కాంగ్రెస్ మద్దతుతో నాడు సీఎంగా కేజ్రీవాల్ ఎన్నికైనా 49 రోజులకే రాజీనామా చేశారు. దీనితో ఢిల్లీలో రాష్ట్రపతి పరిపాలన విధించారు. తరువాత 2014 పార్లమెంట్ ఎన్నికల్లో వారణాసిలో మోడీ పై పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 67స్థానాలను కైవసం చేసుకుని అప్ రికార్డ్ సృష్టించింది. తొలి సారి ఎన్నికల్లో 28 స్తానాలే గెలుచుకున్న అప్ అనూహ్యంగా రాష్ట్రపతి పరిపాలన అనంతరం జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి కాంగ్రెస్ కంచుకోటలో పాగా వేశారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అప్ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకొని మూడవ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టి కొనసాగుతున్నారు.

Aravind kejrival

 

2006లో ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్ స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసి సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 2010లో అన్నా హజారే చేపట్టిన లోక్ పాల్ బిల్లు ఆమోదం కొరకు చేపట్టిన ఉద్యమంలో అయన తో పాల్గొన్న తరువాత మంచి గుర్తింపు వచ్చింది. దాన్ని అనుకూలంగా మరల్చుకుని రాజకీయ పార్టీ పెట్టి రాణిస్తూ వచ్చారు.

ఇప్పుడు తాజాగా ఉత్తరాఖంఢ్ రాష్ట్రంలో అధికారం లక్ష్యంగా అప్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటీవల ఆ పార్టీ నిర్వహించిన సర్వేలో 62శాతం మంది అప్ ను కోరుకుంటున్నట్లు తెలిసిందట. త్వరలో ఆ రాష్ట్రంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయడానికి అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఉత్తరాఖండ్ లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. ఇప్పటికే పంజాబ్ రాష్టంలో 20 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని రాష్ట్ర పార్టీగా అప్ గుర్తింపు పొందింది. గడచిన పార్లమెంట్ ఎన్నికలలో తొమ్మిది రాష్ట్రాల నుండి 40మంది అప్ తరపున పోటీ చేసినా కేవలం పంజాబ్ రాష్ట్రంలో మాత్రమే ఒక ఎంపీ సీటు మాత్రమే గెలుచుకుంది. 2017 గోవా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన అప్ డిపాజిట్ కూడా దక్కించు కోలేకపోయింది. ఉత్తరాఖండ్ ఎన్నికల్లో అప్ నెగ్గుకు వస్తుందో లేదో, అరవింద్ కేజ్రీవాల్, అప్ చరిష్మా ఇంత వరకు పని చేస్తుందో వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !