నిత్యం ఉదయం నిద్రలేవగానే మనం చేసే అనేక రోజువారీ పనుల్లో దంతాలను బ్రష్ చేసుకోవడం కూడా ఒకటి. కొందరు ఉదయం, రాత్రి రెండు పూటలా దంతాలను తోముతారు. కొందరు కేవలం ఉదయం మాత్రమే దంతధావనం చేస్తారు. అయితే టూత్ బ్రష్‌లు, దంతాలను తోమే విషయంలో డెంటిస్టులు పలు సూచనలు చేస్తున్నారు. అవేమిటంటే…
* ఎవరైనా సరే టూత్ బ్రష్‌ను 2 నెలలకు ఒకసారి మార్చాలి. లేదా కనీసం 200 సార్లు అయినా తోమాక వాటిని మార్చాలి. ఎక్కువ కాలం పాటు ఒకే టూత్ బ్రష్‌ను వాడితే దంత సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
* కొందరు బ్రష్‌పై పేస్ట్ పెట్టుకుని ఒకసారి అటు, ఒక సారి ఇటు, కిందకు, పైకి ఒకసారి తోమి వెంటనే నోరు కడిగేస్తారు. కానీ అలా కాదు.. దంతాలను కనీసం 2 నిమిషాల పాటు అయినా తోమాలి. వీలుంటే మరో 2 నిమిషాలు తోమవచ్చు. అలా అని చెప్పి అదే పనిగా తోమకూడదు. వాటిని కూడా నిర్దిష్టమైన సమయం పాటు తోమితే దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ల సమస్యలు రాకుండా ఉంటాయి.
* చాలా మంది టూత్‌బ్రష్‌లను బాత్రూంలకు దగ్గరగా లేదా బాత్రూంలలో పెడతారు. కానీ అలా చేయడం వల్ల బాక్టీరియా టూత్‌బ్రష్‌లపై వచ్చి చేరుతుంది. కనుక బాత్దూరంగా టూత్ బ్రష్‌లను శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. దీంతో బాక్టీరియా బ్రష్‌పై చేరకుండా ఉంటుంది.
* టూత్ బ్రష్ బ్రిస్సెల్స్ సున్నితంగా, మృదువుగా ఉండేలా చూసుకోవాలి. సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్ అని రాసి ఉన్న టూత్ బ్రష్‌లను వాడాలి. దీంతో దంతాలను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. అలాగే చిగుళ్లపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.
* నిత్యం ఉదయం, రాత్రి రెండు పూటలా కచ్చితంగా దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు, చిగుళ్ల సమస్యలు రాకుండా ఉంటాయి.