NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ రాజధాని శంకుస్థాపనకు మోదీ వస్తారా? రారా..??

ప్రధాని మోదీ ఏపీ రాజధాని వికేంద్రీకరణపై ఏమనుకుంటున్నారు. తన చేతులతో స్వయంగా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ఆయన నీరు మట్టి తీసుకువచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మళ్లీ ఇప్పుడు మరో రాజధాని విశాఖ శంకుస్థాపనకు వస్తారా? వచ్చే అవకాశం ఉందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలను పక్కన పెట్టి పద్ధతి ప్రకారం ఒక రాష్ట్ర కొత్త రాజధాని శంకుస్థాపనకు ప్రధానమంత్రిని పిలవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వైసిపి ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీని ఆహ్వానిస్తుంది. ఈ విషయాన్ని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఖరారు చేశారు. మరి మోదీ వస్తారా? రారా? అనేదే ఇప్పుడు చర్చనీయాంశం.

visakaha-capital-inaugural-function-pm-modi-coming-or-not
visakaha-capital-inaugural-function-pm-modi-coming-or-not

రాకపోతే ఒక తంటా!.. వస్తే మరో తంటా ! ఇది మోడీ పరిస్థితి !!

ఆగస్టు 15న అధికారికంగా విశాఖ రాజధాని కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. నిర్మాణాలు, పూర్తిస్థాయి కట్టడాలు ప్రస్తుతానికి ఏమీ ఉండవు గాని పరిపాలన భవనం, సీఎం క్యాంప్ ఆఫీస్, అధికారుల భవనాలుగా మాత్రం కొన్ని ప్రైవేటు భవనాలను వాడుతుంటారు. మరి వీటి ప్రారంభోత్సవానికి, శంకుస్థాపన కు మోదీని ఆహ్వానిస్తారు. సరిగ్గా ఐదేళ్ల క్రిందట 2015 అక్టోబర్ లో అమరావతి రాజధాని శంకుస్థాపన కు ప్రధాని మోదీ వచ్చారు. గంగా నది నుండి నీటిని, పార్లమెంట్ భవనం నుండి మట్టి తీసుకువచ్చారు. కానీ రాజధానికి పెద్దగా నిధులు ఇచ్చింది, కల్పించిన ప్రయోజనం ఏమి లేదు.

ఇప్పుడు విశాఖ కు వస్తారా రారా అంటే వైసీపీ కూడా ఖచ్చితంగా చెప్పలేక పోతుంది. బీజేపీ వర్గాలు మాత్రం రాకపోవచ్చనే అంటున్నారు. దానికి కారణం ఆ రోజు ఆగస్టు 15 కావడం, ఢిల్లీలో స్వతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొనాల్సి ఉండటం, అమరావతిని స్వయంగా ప్రధాని మోదీ తన చేతులతో శంకుస్థాపన చేయడం, మళ్లీ ఇప్పుడు విశాఖ వస్తే అమరావతి పరిస్థితి ఏమిటి, మీరే శంకుస్థాపన చేశారు కదా? అనే ప్రశ్నలకు బిజెపి సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు. ఈ గొడవంతా ఎందుకులే అనుకొని మోదీ రాకపోవచ్చని బిజెపి వర్గాలు అంటున్నాయి. కానీ వైసిపి మాత్రం తమ ప్రణాళికలు పని చేసి పూర్తిస్థాయి లాబీయింగ్ చేసి మోదీ ని కనుక రప్పించగల్గితే కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు జగన్ పైన, వైసీపీ పైన పూర్తి స్థాయిలో ఉన్నాయని రాష్ట్రంలో ప్రతి సగటు మనిషికి అర్థం అవుతుంది. అందుకే మోదీ ని రప్పించేందుకు వైసీపీ ప్రయత్నం వైసీపీ చేస్తుండగా, రాకుండా ఉండేందుకు బిజెపి సాకులు వెతుకుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో!.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?