బిగ్ బాస్ 4 తెలుగు ప్రేక్షకులను వినూత్న రీతిలో అలరించడం మొదలుపెట్టింది. మొదట్లోనే షో హైప్ అందుకునేందుకు మంచి మంచి టాస్క్ లను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు ఇస్తూనే ఉన్నాడు. స్కిట్స్ కావచ్చు… గేమ్స్ కావచ్చు…. డ్యాన్స్ షో లు కావచ్చు ప్రతి సీజన్ మధ్యలో ఏర్పాటు చేసే గేమ్స్ అన్ని బిగ్ బాస్ షో మొదట్లోనే చేసేస్తున్నాడు.
ముందు వారం అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని అర్థం చేసుకున్న బిగ్ బాస్ ముందు ఎంటర్టైన్మెంట్ తో కొన్ని వారాలు లాగిన తరువాత నిదానంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరి నిజ స్వరూపం బయటకు వస్తుందన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారని ప్రేక్షకులు అంటున్నారు. అయితే ఇదే సమయంలో ఏ సీజన్ లో లేని విధంగా ఒక్కసారిగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది హౌస్ లో నడుస్తుంది. మోనాల్ గజ్జర్-అఖిల్-అభిజిత్ మధ్య జరుగుతున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ లో చివరికి మోనాల్ ను దక్కించుకునేది ఎవరన్న విషయంపై సర్వత్రా చర్చ నడుస్తుంది.
అభిజిత్ తో పోలిస్తే అఖిల్ మోనాల్ విషయంలో చాలా ఎమోషనల్ అయిపోతున్నట్లు అనిపిస్తోంది. తాజాగా బిగ్బాస్ ఈరోజుటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేశారు. వీటిలో యువ జంటలన్నీ డాన్స్ వేస్తూ ఉన్నట్లు అర్థమవుతోంది. మెహబూబ్ దిల్ సే, దేత్తడి హారిక ‘టాప్ లేచిపోద్ది’ సాంగ్ కు నిజంగానే టాప్ లేచిపోయే పర్ఫార్మెన్స్ తో ఇరగ్గొట్టేశారు. అయితే ఇదే వరుసులో మరొక హ్యాండ్సం కంటెస్టెంట్ సోహెల్ తో కలిసి మోనాల్ వాన వాన వెల్లువాయే సాంగ్ వేస్తున్నట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది.
ఈ సాంగ్ కి సంబంధించిన స్టెప్స్ ను మోనాల్, సోహైల్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అఖిల్ వారిద్దరి పక్కనే కూర్చుని వారు డాన్స్ వేస్తుంటే… ఎంతో దీనంగా చూస్తున్న వీడియోలో అతని హృదయ వేదనను తెలియజేసేలా ఒక సాంగ్ కూడా వేశారు. ఇక హౌస్ లోని అందరూ అఖిల్ దీనస్థితిని గమనిస్తూ ఉన్నారు. సోహైల్.. మోనాల్ తో డాన్స్ చేయడం అఖిల్ కు అసలు నచ్చినట్లు లేదు. అభిజిత్ పెద్దగా పట్టించుకోలేదు కానీ అఖిల్ మాత్రం చాలా ఎమోషనల్ గా గుండెకు తీసుకున్నాడు అని సోషల్ మీడియాలో అందరూ తెగ ఫీల్ అయిపోతున్నారు