Bad Cholesterol: మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది ఒకటి మంచి కొలెస్ట్రాల్ హెచ్ డీ ఎల్.. మరొకటి చెడు కొలెస్ట్రాల్ ఎల్ డి ఎల్.. మంచి కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అదే చెడు కొలెస్ట్రాల్ ఇది మన ఆరోగ్యానికి హాని చేస్తుంది.. చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలో పేరుకుపోయినప్పుడు శరీరం ముందుగానే మనకు కొన్ని లక్షణాలను చూపిస్తుంది.. వాటిని ముందుగానే గుర్తిస్తే..!? అనేక అనారోగ్య సమస్యల నుంచి ముందుగానే బయటపడవచ్చు..!! అవేమిటో ఇప్పుడు చూద్దాం..!!
శరీరంలో కొవ్వు నిల్వలు అధికంగా ఉంటే దేహంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగదు. దీంతో అధిక రక్తపోటు పెరుగుతుంది శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఛాతీలో నొప్పి, గుండెల్లో మంట గా ఉంటుంది. ఎల్ డి ఎల్ ఎక్కువగా ఉన్నప్పుడు చర్మంపై ఎరుపు, పసుపు రంగులో కురుపులు వస్తాయి. వాటిని చాలామంది మెటిమలు గా భావించి ఆశ్రద్ధ వహిస్తారు. అయితే ఇవి కొవ్వు పేరుకుపోవడం వలన కనిపిస్తాయని గమనించాలి. మొహం పై ఇటువంటి గుల్లలు కనిపించిన వెంటనే జాగ్రత్త వహించి వైద్యుడిని సంప్రదించాలి.
దేహంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వస్తాయి. అంతేకాకుండా పక్షవాతం వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకని పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి. దానికనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్వ ఉన్న ఆహారం, వేయించిన ఆహార పదార్థాలు, ఫ్రైడ్ ఫుడ్స్, బయట దొరికే చిరుతిళ్లు, నూనె లో నిల్వ ఉన్న ఆహారం తీసుకోకూడదు. తాజా కూరగాయలు, పండ్లు, పండ్ల రసాలు, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని మాత్రమే తినాలి.
Read More:
YCP Govt: జగన్ కు ఆ విషయంలో జై కొట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..!!
AP Capitals Issue: రాజధాని కేసుల్లో మరో ట్విస్ట్ ..! ఆ విషయంపై డిసెంబర్ 27న క్లారిటీ..?
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…
అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…
సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నమోదైన కేసుల్లో బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల…
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కెరీర్లో ఎప్పటికీ గుర్తిండి పోయే చిత్రాల్లో `పోకిరి` ముందు ఉంటుంది. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో గోవా…
గత కొద్ది రోజుల నుండి సరైన కంటెంట్ ఉన్న సినిమా రాకపోవడంతో.. ప్రేక్షకులు లేక థియేటర్స్ వెలవెలబోయాయి. కానీ, గత శుక్రవారం విడుదలైన `బింబిసార`, `సీతారామం` చిత్రాలు..…