భారతదేశపు అతిపెద్ద రియాలిటీ షో 9వ వారానికి చేరుకుంది. బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ ప్రక్రియ ప్రకంపనలు సృష్టించింది. ఇంటి సభ్యుల మధ్య ఆవేశాలు పెల్లుబికాయి. ప్రతి ఇంటి సభ్యుడు ఎవరో ఒకరి తో గొడవ పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా సోహెల్, అరియానా, అభిజిత్, అమ్మరాజశేఖర్, అఖిల్ ఒక్కసారిగా రెచ్చిపోయారు.
సరిగ్గా నామినేషన్లకు ముందు బిగ్బాస్ కంటెస్టెంట్ లకు అవసరమైన ఫైర్ అందించాడు. ఇకనుండి ఇంటి సభ్యులు అందరూ అసలైన ఆట ఆడే సమయం వచ్చిందని హెచ్చరించాడు. కోడిగుడ్లను పంపించి నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టాలని సూచించారు. తాము నామినేట్ చేయదలుచుకున్న కంటెస్టెంట్ తలపై కోడిగుడ్డు కొట్టాలని చెప్పారు. ఎప్పటిలాగే సోహెల్ సయ్యద్ మరోసారి రెచ్చిపోయాడు.
అరియానా పై ఒంటికాలిపై లేచాడు. అరియానా దగ్గరికి వెళ్లి నీ దగ్గర ఇంకొక గుడ్డు ఉందా… నా తల పైన కొట్టు ఇద్దరం కలిసి హోళీ ఆదుకుందాం అంటూ ఆమెను రెచ్చగొట్టాడు. సోహెల్ అలా రెచ్చిపోవడం చూసి అరియానా నవ్వుతూ నిలబడిపోయింది. ఇక అందరూ ఊహించినట్లే మోనాల్ గజ్జర్ పైన సోహెల్ సమయం చూసి ఫైర్ అయ్యాడు. నీకు ఏదైనా మ్యాటర్ చెబితే అవతలికి వెళ్లి ఛెవిలో ఊదేస్తావా అంటూ ఆమెను సూటిగా ప్రశ్నించాడు.
అంతటితో ఆగకుండా ఆమె తలపై గుడ్డు కొట్టి నామినేట్ చేశాడు. ఇలాంటి సమయంలో అభిజిత్, సోహెల్ మధ్య భారీగానే డిస్కషన్ జరిగినట్లు కనిపించింది. అలాగే అందరికీ భిన్నంగా అభిజిత్ అమ్మరాజశేఖర్ మధ్య గొడవ జరుగుతుంటే సోహెల్ జోక్యం చేసుకున్నాడు. ఇలా సోహెల్ ఇంట్లో ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు అన్న విషయంపై ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చేసింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!