NewsOrbit
జాతీయం ట్రెండింగ్

Chhattisgarh: సెల్ ఫోన్ కోసం 41 లక్షల లీటర్ నీరు వృధా చేసిన ప్రభుత్వ అధికారి సస్పెండ్ చేసిన కలెక్టర్..!!

Share

Chhattisgarh: ఉత్తర భారత దేశంలో నీరు కోసం ప్రజలు ఎంత అల్లాడిపోతారో అందరికీ తెలుసు. ఉత్తర భారతంలో అనేక చోట్ల త్రాగటానికి నీరు దొరకని పరిస్థితి కనిపిస్తుంటది. కొన్ని రాష్ట్రాలలో త్రాగునీరు కోసం కొన్ని వేల కిలోమీటర్లు వెళ్లి… నీరు తెచ్చుకునే దారిద్రయం కనిపిస్తుంటది. అటువంటి రాష్ట్రాలలో చత్తీస్ ఘర్ ఒకటి. అయితే ఈ రాష్ట్రంలో రాజేష్ విశ్వాస్ అనే ఫుడ్ ఆఫీసర్ కనేకర్ జిల్లాలో… వెకేషన్ కి వెళ్లడం జరిగింది. అక్కడ ఖర్కట్ట డ్యాం సందర్శించడానికి వెళ్లి పంపు సర్వీసెస్ పనులు గురించి తెలుసుకుంటూ… అక్కడ సెల్ఫీ దిగే క్రమంలో సెల్ ఫోన్ డ్యామ్ లో జార విడిచాడు. ఈ పరిణామంతో తన సెల్ ఫోన్ తిరిగి పొందుకోవటానికి ఏకంగా డ్యాంలో ఉన్న నీటిని మొత్తం విడిచేశాడు. ఎన్ని లీటర్ల తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

Collector suspended by government official for wasting 41 lakh liters of water for cell phone

ఏకంగా 41 లక్షల లీటర్స్ వృధాగా ఒక చిన్న సెల్ ఫోన్ కోసం విశ్వాస్ అనే ఫుడ్ ఆఫీసర్ వదిలేశాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఇరిగేషన్ సబ్ డివిజనల్ ఆఫీసర్… వెంటనే వచ్చి మొత్తం యాక్షన్ తీసుకుని… నీటిని అదుపు చేయడం జరిగింది. ఈ క్రమంలో రాజేష్ తన పై అధికారులకు.. సమాచారం అందించి ఫోనులో ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం… ఉండటంతో పరిమిషన్ తీసుకుని… నీటిని వదిలినట్లు తెలిపారు. అయితే మొదట్లో 21 లక్షల లీటర్ల నీటిని వదిలినట్లు.. వార్తలు రాగా తాజాగా 41 లక్షల లీటర్ల నీటిని వృధాగా ఒక చిన్న సెల్ఫోన్ కోసం… వృధా చేసినట్లు బయటపడింది.

Collector suspended by government official for wasting 41 lakh liters of water for cell phone

దీంతో ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రియాంక శుక్ల… ఫుడ్ ఆఫీసర్ రాజేష్ విశ్వాస్ పై ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయడం జరిగింది. పైగా వేసవికాలం ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్న సమయంలో…సెల్ ఫోన్ కోసం పై అధికారులకు సరైన సమాచారం ఇవ్వకుండానే ఈ రకంగా లక్షల లీటర్ల నీటిని వృధా చేయటం పట్ల జిల్లా కలెక్టర్ మండిపడటం జరిగిందంట.


Share

Related posts

Mushrooms: సర్వరోగనివారిణి.. ఈ సంజీవనిని తింటున్నారా..!?

bharani jella

Devatha Serial: రాధకు షాక్ ఇచ్చిన జానకమ్మ.. ఆదిత్య, సత్య తీసుకున్న నిర్ణయం దేవుడమ్మకి తెలిస్తే..!?

bharani jella

Mother: నిద్రపోతున్నాడు అనుకుంటున్న ఆ తల్లికి తనకొడుకు బతికి లేడు అని తెలీదు – హృదయాన్ని కదిలించే కథ

Naina