Cyberabad Police: సైబర్ నేరాలు సహా సామాజిక పరిస్థితులపై నెటిజన్లకు అవగాహన కల్పించడంలో సైబరాబాద్ పోలీసులు ముందుంటారు. ఇలా అవగాహన కల్పించడం, యువతకు అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా చెప్పడం వీరి ప్రత్యేకత. ఇంతకు ముందు సినిమా నటులతో మీమ్స్ తరహాలో సైబర్ నేరాల పై అవగాహన కల్పించారు. బ్రహ్మానందంతో రూపొందించిన మీమ్స్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి.. తాజాగా కరోనా విజృంభిస్తున్న వేళ మాస్క్ ప్రాధాన్యతను వివరించేందుకు పోలీసులు కూడా మీమ్స్ ఎంచుకున్నారు.. అయితే ఈసారి మహేష్ బాబు ఫోటోలతో మీమ్స్ చేయడం విశేషం..

కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి.. అయితే అత్యవసర సమయాల్లో బయటికి వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించడం తప్పనిసరి.. మాస్క్ ధరించడం పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు.. తాజాగా సైబరాబాద్ పోలీసులు మహేష్ బాబు ను ఇలా వాడేశారు.. డెనిమ్ జీన్స్, జాకెట్ వేసుకున్న మహేష్ బాబు ఫోటోలు షేర్ చేసిన పోలీసులు.. డెనిమ్ మీద డెనిమ్ ఫ్యాషన్ ట్రెండ్.. మాస్క్ మీద మాస్క్ సేఫ్టీ ట్రెండ్.. అంటూ ఫోటోను షేర్ చేశారు.. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది విషయం ఏదైనా సరికొత్తగా చెప్పేందుకు ప్రయత్నిస్తారని సైబరాబాద్ పోలీసుల పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. అభిమాన నటీనటులతో పోలీసులు చేసే ఈ ప్రయత్నాలు ఫలించి జనాల్లో అవగాహన వస్తే బాగుంటుందని పలువురు కోరుకుంటున్నారు.
Safety First..#WearAMask #StaySafe #IndiaFightsCorona#Unite2FightCorona @urstrulyMahesh @MaheshBabu_FC @TelanganaCOPs pic.twitter.com/jNvP6XW0PS
— Cyberabad Police (@cyberabadpolice) May 11, 2021