Cyclone Asani Update: అసాని తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. విశాఖ కి దక్షిణ నైరుతి దిశగా దూసుకొస్తున్న విశాఖ కాకినాడ మధ్య దిశను మార్చుకోనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. దీంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం గ్యారెంటీ అని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితి ఇలా ఉంటే అసాని మరింత తీవ్రరూపం దాల్చి … రేపు సాయంత్రం కల్లా చీరాల .. బాపట్ల జిల్లా పై తుఫాను ప్రభావం చాలా కఠినంగా ఉంటుందని ఆ దిశగా తుఫాన్ పయనిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దాదాపు నాలుగు గంటల దాకా ప్రకాశం అదేవిధంగా బాపట్ల జిల్లాలలో తీవ్రమైన వర్షాలు కురవడం గ్యారెంటీ అని… ప్రస్తుతం రాత్రికి బలమైన గాలులుతో.. తుఫాను తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. రేపు తెల్లవారుజామున అసాని తుఫాన్ వల్ల వర్షాలు మరింతగా కురవటం గ్యారెంటీ అని అన్నారు.
నెల్లూరు జిల్లా కావలితో పాటు మరికొన్ని ఉత్తర భాగంలో తీవ్రమైన వర్షాలు.. మరి కొన్ని జిల్లాలలో రాత్రి నుండి తుఫాను ప్రభావం భారీ నుంచి అతి భారీ గా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం వాయువ్య దిశ నుండి పశ్చిమ వాయువ్య దిశగా.. మచిలీపట్నం వైపు ప్రయాణిస్తూ ఏపీ తీరానికి చేరువ అవుతోంది. దీంతో తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టరేట్ లో అధికారులు కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడం జరిగింది.