Dehydration: మనిషి శరీరంలో వాటర్ లెవెల్స్ తగ్గిపోతే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది.. ఎండాకాలం లోనే ఈ సమస్య వస్తుందని అనుకుంటారు. అయితే ఇది పొరపాటే.. ఎండాకాలం తో పోలిస్తే చలికాలంలో డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. శీతాకాలంలో డిహైడ్రేషన్ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..!!
సాదారణంగా వేసవి కాలం తో పోలిస్తే శీతాకాలంలో నీరు తక్కువగా తాగుతారు. వేసవికాలంలో లో చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటికి వెళ్లి పోతుంది. కాబట్టి డీహైడ్రేషన్ సమస్య వస్తుందని అనుకోవద్దని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. చలికాలంలో మన శరీరంలో ఎక్కువగా తేమను కోల్పోతుంది. దీని వలన డీహైడ్రేషన్ కు గురి అవుతారని వారు చెబుతున్నారు. శీతాకాలంలో ఎండాకాలంలో లాగా దాహం వేయదు. మనం తాగే నీటిని కూడా కాస్త తక్కువగా తీసుకుంటాం. అందువలన డిహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది.
అందువలన చలి కాలంలో దాహం వేయకపోయినా కూడా ప్రతి రెండు గంటలకు ఒకసారి కొద్దిగా నీటిని తాగాలి చలికాలంలో నీరు తాగటం ఇష్టం లేకపోతే వేడి వేడిగా సూప్ తయారు చేసుకుని తాగితే ఇవి శరీరంలో వేడిని పుట్టించడం తో పాటు డీహైడ్రేషన్ సమస్య కూడా బయట పడేస్తాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. ఇంకా కొబ్బరి బొండం నీళ్లు, మజ్జిగ, జ్యూస్లు ఎంపిక చేసుకోవచ్చు. దప్పిక అయ్యేవరకు తాగకుండా ఉండటం కంటే ముందుగానే తాగటం మంచిది.