ట్రెండింగ్

Khargone communal clashes: ఖర్గొన్ లో శ్రీరామనవమి అల్లర్లలో పారిశుద్ధ్య కార్మికుని హత్య చేసిన ఐదుగురు అరెస్ట్..!!

Share

Khargone communal clashes: శ్రీ రామనవమి పండుగ సమయంలో శోభ యాత్ర నిర్వహించిన క్రమంలో కొంతమంది ఆకతాయిలు అల్లర్లు సృష్టించిన సంగతి తెలిసిందే. యాత్ర చేస్తున్న వారిపై రాళ్లు రువ్వారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖర్గోన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి అల్లర్లకు పాల్పడిన 84 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే సమయంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్… అల్లర్లకు పాల్పడిన వారి ఇళ్లను బుల్డోజర్ తో కూల్చేయడం జరిగింది. ఖర్గోన్ నగరంలో అత్యంత సున్నితమైన చోటీ మహల్ టాకీస్ ప్రాంతంలో భారీ భద్రత నడుమ అల్లర్లకు పాల్పడిన వారి ఇళ్లను మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూల్చేసింది. ఇక ఇదే సమయంలో 28 సంవత్సరాల వయసు కలిగిన ఇబ్రిస్ ఖాన్ అనే వ్యక్తి తలనిండ గాయాలతో అల్లర్లు జరిగిన సమయంలో మరణించాడు. అతని మరణానికి గల కారణం మతకలహాలు అని పోలీసులు భావిస్తున్నారు. Ram Navami Clashes In Khargone

మరోపక్క వేరే కోణం ఏమైనా ఉందా అని ఆరా తీయడం జరిగింది. మృతుడు ఇబ్రిస్ ఖాన్ శానిటేషన్ వర్కర్. అయితే ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురు నిందితుల పేర్లను ఖర్గోన్ జిల్లా ఎస్పి రోహిత్ మీడియా కి తెలియజేశారు. సందీప్, దిలీప్, అజయ్, దీపక్, అజయ్ కర్మ అని పేర్కొన్నారు. ఇంకా ముగ్గురు పరారీలో ఉన్నారని వాళ్లను పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా గాలింపులు స్టార్ట్ చేయడం జరిగింది అని ఎస్పీ తెలిపారు. ఘటనలో మృతి చెందిన 28 సంవత్సరాల వ్యక్తి గతంలో ఎవరితోనూ గొడవలు లేవని… మత కలహాల కారణంగానే మరణించినట్లు భావిస్తున్నారు.house constructed under PM Awas Yojana demolished in Khargon

ఏప్రిల్ 11 ఆదివారం శ్రీరామనవమి సమయంలో ఈ ఘటనలో ఆరుగురు పోలీసులతో సహా 24 మంది గాయపడటం జరిగింది. దీంతో పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకునీ విచారణ చేస్తూ అల్లర్లకు ప్రధాన కారణం దానికి బాధ్యులైన వారిని పట్టుకునే ప్రయత్నాల్లో చేస్తూ ఉన్నారు. మొదటిసారి మిస్సింగ్ కేసుగా తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా తర్వాత… ఇబ్రిశ్ ఖాన్ శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా చెందారు. ఖర్గొనే లోనే ఆనంద నగర్ వద్ద కనుగొనడం జరిగింది. ఈ క్రమంలో గొడవకు పాల్పడినా ప్రాంతాలలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్ సాయంతో 90 భవనాలను మరికొన్ని ఇళ్లను కూల్చేశారు. ఈ క్రమంలో ఓ వర్గం కావాలనే కక్షగట్టి బీజేపీ ప్రభుత్వం… కూల్చే కార్యక్రమం చేస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు.


Share

Related posts

రేణు దేశాయ్ అంత పెద్ద షాకింగ్ నిర్ణయం తీసుకుందని పవన్ కల్యాణ్ కి అసలు తెలుసా? తెలిస్తే రియాక్షన్ ఏమిటో

arun kanna

Mallik Paruchuri: మల్లిక్ పర్చూరి ఎవరు.? కేసు ఏమిటి..!? పోరాటం ఎందుకు..!? సంచలన విషయాలు ఇవీ..!!

somaraju sharma

Diabetes: మధుమేహం ఉన్నవారు వంకాయ తినొచ్చా..!?

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar