గంగవ్వ ఎంట్రీ బిగ్ బాస్ నాలుగవ సీజన్ కు ఎంతటి గుర్తింపు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మై విలేజ్ షో నుండి యూట్యూబ్ స్టార్ అయిన గంగవ్వ బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఇక ఆమె బిగ్ బాస్ ద్వారా గెలుపొందిన డబ్బుతో సొంత ఇంటి కలను కూడా నిజం చేసుకోబోతోంది. నాగార్జున అందుకయ్యే ఖర్చును భరిస్తాను అని కూడా చెప్పాడు.
ఇక బిగ్ బాస్ లో గెలిచిన చెక్ ను ఉపయోగించుకొని గంగవ్వ షాపింగ్ కూడా చేసింది. ఇక స్పెషల్గా లక్ష రూపాయలు పెట్టి బంగారం కొనుగోలు చేసిన గంగవ్వకు నాగార్జున తప్పకుండా ఇల్లు కట్టి ఇస్తానని ఇచ్చిన హామీను కూడా బహుమతిగా పొందింది. బిగ్ బాస్ ఆధ్వర్యంలో నాగార్జున కట్టిస్తున్న ఇల్లు పై ఒక వీడియో రిలీజ్ చేసింది. తన ఇంటి పనులు వేగంగా జరుగుతున్నాయని మరొక రెండు మూడు నెలల్లో గంగవ్వ కొత్త ఇంటి లోకి వెళ్తుందని చెప్పేసింది.
ఇక 18 లక్షల ఖర్చుతో ఇంటి నిర్మాణం ఉన్నట్లు… తన పక్క ఊరి కాంట్రాక్టర్ కు తన ఇంటి నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది. చివరికి వారు అనుకున్న రేట్ కి ఇంటి నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టినట్టు చెప్పిన గంగవ్వ నిర్మాణం అనంతరం కుదిరితే ఒక కారు కూడా కొంటానని వివరణ ఇచ్చింది. ఒక్క దెబ్బతో సొంత ఇల్లు, కారు కొనేసుకుంటున్న గంగవ్వకు కు 2020 బాగా కలిసి వచ్చినట్లు ఉంది.