Guntagalagara Aaku: పూర్వకాలం నుంచి భారతీయులకు అందాన్ని ఆరోగ్యాన్ని ఆయువును అందించిన అమృత ఔషధం గుంటగలగర.. ఈ గుంటగలగరాకు ను ఫాల్స్ డైసీ అని అంటారు.. దీనిని సంస్కృతంలో భృంగరాజ అని పిలుస్తారు.. గుంటగలగరాకు మొక్క తేమ ఉండే ప్రదేశాలలో ఎక్కువగా కనిపిస్తుంది.. పొలాల గట్ల మీద కాలువల దగ్గర విరివిగా పెరుగుతుంది.. గుంటగలగరాకు ను ఏ విధంగా ఉపయోగించిన ఆరోగ్యానికి మంచిదే.. గుంటగలగరాకు రసం, పొడి, పచ్చడి ఇలా ఏ విధంగా తీసుకున్న బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ మొక్కలు బోలెడు ఔషధగుణాలు దాగి ఉన్నాయి.. అన్ని ఔషధ గుణాలు దాగిఉన్న గుంటగరగరాకు ప్రయోజనాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!!

Guntagalagara Aaku: బృంగరాజ్ తైలం ఉపయోగాలు..!!
గుంటగలగరాకు ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి మిక్సీ పట్టి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.. ఇప్పుడు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లో ఈ ఈ ఆకుల పేస్టు వేసి నూనె పచ్చ రంగులోకి మారే దాకా రెండు లేదా మూడు రోజులు ఎండలో పెట్టాలి.. ఇది అద్భుతమైన బృంగరాజ్ తైలం.. ఈ తైలాన్ని సింపుల్గా తయారు చేసుకోవాలంటే బృంగ్రాజ్ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. లేదంటే ఆయుర్వేద షాప్ లో గుంటగలగరాకు పొడి దొరుకుతుంది. దీనిని వేడివేడి కొబ్బరినూనెలో వేసి కలపాలి. అంతే బృంగరాజ తైలం సిద్ధం. గుంటగలగరాకు నూనె లో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, విటమిన్ ఎ అధికంగా ఉంటుంది ఈ సూపర్ ఎఫెక్ట్ ఆయిల్ హెయిర్ కి టానిక్ లా పనిచేస్తుంది.. జుట్టు ఊడకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. చుండ్రు సమస్య ను తగ్గిస్తుంది . అన్నిరకాల జుట్టు సమస్యలకు చెక్ పెడుతుంది..

Guntagalagara Aaku: గుంటగలగరాకు ఆరోగ్య ప్రయోజనాలు..!!
గుంటగలగరాకు ఆకుల రసం లో ఐదు మిల్లీ గ్రాముల తేనె కలిపి ప్రతి రోజు ఉదయం సాయంత్రం సేవిస్తే జలుబు, దగ్గు, గొంతులో గర గర, ఆయాసం తగ్గిస్తుంది.. గుంటగలగరాకు లను మెత్తగా నూరి తలకు పట్టిస్తే జుట్టు రాలే సమస్య నుండి బయటపడవచ్చు జుట్టు ఒత్తుగా పెరగడానికి దోహదపడుతుంది. గుంటగలగరాకు రసాన్ని కాటన్ బట్టలో వేసి రెండు చుక్కలు ముక్కులో పిండితే తలనొప్పి, మెదడు బలహీనత, తల బరువు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గుంటగలగరాకు ఆకులను నమిలితే నోటి చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోటిదుర్వాసన, నోటి సమస్యలనుండి కాపాడుతుంది.