Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ షోలో చాలా మంది సీనియర్ యాక్టర్ లు తెలుగు లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ యాక్టర్ ల కోటా కింద తెలుగు బిగ్ బాస్ హౌస్ లో… గత ఐదు సీజన్లలో చాలా మంది కనిపించడం జరిగింది. హేమ, కరాటే కళ్యాణి, సమీర్, ఉమా దేవి, ప్రియ ఆంటీ, జ్యోతి ఇంకా చాలా మంది సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు తెలుగు బిగ్ బాస్ షోలో కనువిందు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు హీరోయిన్ రాశి నీ ఓటిటి బిగ్ బాస్ లోకి తీసుకురావడానికి షో నిర్వాహకులు డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వంద రోజులకు గాను.. దాదాపు కోటికి దగ్గరలో ఫిగర్ రెమ్యునిరేషన్ రాశి డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో షో నిర్వాహకులు సగం ఎమౌంట్ కి ముందుగా ఎగ్రిమెంట్ మీద సంతకం చేయడానికి రెడీ అయినట్లు అంతా ఓకే అయితే షో క్లిక్ అయితే.. మీ ఆట బాగుంటే ఖచ్చితంగా మిగతా అమౌంట్ ఇవ్వడానికి.. ఏమాత్రం ఇబ్బంది లేదని అన్నట్లు దీంతో రాశి ఆలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి.
కచ్చితంగా మాత్రం రాశి ని తెలుగు ఓటిటి బిగ్ బాస్ లోకి తీసుకునే ఆలోచనలో … షో నిర్వాహకులు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా… గ్లామర్ పాత్రలో చాలా మందిని ఆకట్టుకుంది రాశి. హీరోయిన్ ఛాన్సులు అయిపోయాక ఐటమ్ సాంగ్స్ చేస్తూ అలరించిన రాశి.. ఆ తర్వాత విలన్ పాత్రలు కూడా చేయడం జరిగింది. అనంతరం చాలా వరకు ఇండస్ట్రీకి దూరమైన రాశి.. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.