Kitchen: చాలామంది వంటలు తక్కువ ప్లేస్ ఉండేలా చూస్తూ ఉంటారు కానీ అది పొరపాటు. వంటగది కూడా సరైన స్థలం ఇవ్వాలి.. వంటగది లో చాలా వస్తువులు ఉంటాయి . మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా వంట గదిలోనే ఉంటాయి. అందుకే వంటగదిని వాస్తు దిశలో నిర్మించుకోవడమే కాకుండా వాస్తు నియమాలను కూడా పాటిస్తూ ఉండాలి.

మామూలుగా ఆగ్నేయంలో వంటగదిని నిర్మించుకుంటాం. ఇక వంట గదిలో స్టవ్ కూడా ఆగ్నేయ కోణంలో ఉండాలి. వంట చేసేటప్పుడు ముఖం తూర్పు వైపుగా ఉండేలాగా చూసుకోవాలి. దీనివల్ల సంపద పెరగడమే కాకుండా ఆరోగ్యం కూడా కలుగుతాయి. ఇక వంట గదిలో తాగునీటిని నిలువ చేసుకోవడానికి, చేతులు కడుక్కోవడానికి ఏర్పాటు చేసుకునే కుళాయిలను ఈశాన్యం దిశలో ఉండేలా చూసుకోవాలి. అలాగే వంట గదిలో వాయువ్య మూలన సింక్ ఉంటే శుభప్రదంగా భావిస్తారు. మైక్రోవేవ్ ఓవెన్, టోస్టర్, మిక్సర్ గ్రైండర్, జ్యూసర్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆగ్నేయ కోణానికి సమీపంలో దక్షిణం వైపు ఉంచటం శుభ సూచికంగా భావిస్తారు.
ఫ్రిడ్జ్ ను దక్షిణా లేదా పశ్చిమ దిశలో ఉంచాలి. ఫ్రిడ్జ్ ను ను ఈశాన్యం , నైరుతి కోణంలో ఎప్పుడు పెట్టకూడదు. వంటగదిలో మసాలా దినుసులు, ఆహార పదార్థాలు, పప్పులు, బియ్యం, పిండి, పాత్రలు ఏవైనా సరే దక్షిణం , నైరుతి దిశలో ఉంచితే మంచిది. ఖాళీ సిలిండర్ ను నైరుతి దిశలో ఉండాలి .
వాస్తు ప్రకారం.. వంటగది గోడలకు లేత నారింజరంగు కానీ, క్రీం కలర్ కానీ వేయడం వల్ల ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. వంట గదిలో ఎప్పుడూ నలుపు రంగును, నీలం రంగును పెయింట్ వేయించకుండదు. నలుపు రంగును వంట గదిలో ఉపయోగిస్తే ప్రతికూల ప్రభావం ఉంటుంది. కావున పొరపాటున కూడా నలుపు రంగును వంట గదిలో వేయించకండి. నలుపు రంగును ఉపయోగించడం వల్ల ఇంట్లో ఆర్థిక నష్టం జరిగే అవకాశం పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
వంటగది ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంటే వాస్తు దోషాలకు అవకాశం ఉంటుంది. అవి తొలగిపోవాలంటే ప్రధాన ద్వారానికి, వంటగదికి మధ్య కర్టెన్స్ వెయ్యాలని చెబుతున్నారు. వంటగది వాస్తు దిశలో లేకపోతే, వాస్తు దోషాన్ని తొలగించడం కోసం.. వంటగదికి ఆగ్నేయ దిశలో ఎర్రటి బల్బును ఉంచాలి. అలాగే ఆ బల్బు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో ఉండకూడనివి ఉంటే ఇబ్బందులు తప్పవు.