Marie Tharp (మేరీ థర్ప్) : ప్రపంచ పటం రూపు రేఖలు మార్చిన భూగోళ శాస్త్రవేత్త, సముద్ర శాస్త్ర కార్టోగ్రాఫర్
మేరీ థర్ప్(Marie Tharp) గౌరవార్ధం నేడు గూగుల్ ఆమెకు సంబంధించిన ఇంటరాక్టివ్ గూగుల్ డూడుల్(Google Doodle) విడుదల చేసింది. ప్రపంచ పటం రూపు రేఖలు మార్చిన భూగోళ శాస్త్రవేత్త, సముద్ర శాస్త్ర కార్టోగ్రాఫర్, మేరీ థర్ప్(Marie Tharp) ఎవరు, మేరీ థర్ప్ గొప్పతనం ఏమిటి, ఎందుకు మేరీ థర్ప్ పై గూగుల్ డూడుల్, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఇక్కడ సమాధానం తెలుసుకుందాం. మేరీ థర్ప్(Marie Tharp) గురించి చదవడం కొనసాగించండి…

ఆస్ట్రేలియా కి చెందిన కొన్ని ఆదిమ తెగలు మాట్లాడే భాషలో కొన్ని పదాలు తెలుగు ఇంకా ఇతర ద్రవిడియన్ భాషలలోని పదాలకు చాలా దెగ్గరగా ఉంటాయి అనే విషయం మీకు తెలుసా? అవును ఎందుకంటే ఇప్పుడు వేరుగా ఉన్న ఇండియా ఆస్ట్రేలియా ఒకప్పుడు అతుక్కుని ఉన్న ఒకే ఖండం. భూఖండ చలనము(Continental Drift Theory) ప్రకారం ఒకప్పుడు ఒకటిగా ఉన్న గోండ్వానా అనే మహాఖండం నుండి విడిపోయిన భాగాలు ఇవి. అందుకే ఈరోజుకు కూడా అక్కడ ఆదిమ తెగల భాష మరియు జీవన శైలి దక్షిణ భారతదేశం లోని కొన్ని ఆదివాసీ తెగలను పోలి ఉంటుంది.
మేరీ థర్ప్ కి భూఖండ చలనము కి ఇంకా ఈ ఆదిమ తెగల భాష మరియు జీవన శైలి కి సంబంధం ఏమిటి అని తల పీకుంటున్నారా? తొందర పడకుండా పూర్తిగా చదవండి…

మేరీ థర్ప్(Marie Tharp) గురించి ముందుగా తెలుసుకోవలసింది
అమెరికాకు చెందిన మేరీ థర్ప్(Marie Tharp) ఒక భూగోళ శాస్త్రవేత్త మరియు మహాసముద్ర నేల (ఓషన్ ఫ్లోర్) కార్టోగ్రాఫర్. పటాలు(maps) ని శాస్త్రీయంగా చిత్రీకరించె వారిని కార్టోగ్రాఫర్లు అని అంటారు. ప్రపంచంలో తొలిసారిగా మహాసముద్ర నేలకు సంబంధించిన మ్యాప్స్ రూపొందించిన ఘనత మేరీ థర్ప్ కు సొంతం.

మేరీ థర్ప్ కొనుగొన్న విషయాలు, ఆమె రూపొందించిన మహాసముద్ర నేల పటాలు, కాంటినెటల్ డ్రిఫ్ట్ థియరీ(భూఖండ చలనము) ని నిరూపించిన మూల సాధనాలు
కైట్లిన్ లార్సెన్, రెబెక్కా నెసెల్ మరియు డాక్టర్ టియారా మూర్: భూగోళ శాస్త్రం మరియు సముద్రపు కార్టోగ్రఫీ కి సంబంధిచిన ఈ మహిళా శాస్త్రవేత్తలు గూగుల్ విడుదల చేసిన ఇంటరాక్టివ్ గూగుల్ డూడుల్ లో మేరీ థర్ప్ కథని మనకు వివరిస్తారు.

సంబంధిత లింక్: మేరీ థర్ప్(Marie Tharp) గూగుల్ డూడుల్ ఇక్కడ చూడవొచ్చు
1920 లో మిచిగన్ USA లో పుట్టిన మేరీ థర్ప్ తన బాల్యం నుండే తండ్రి ధ్వారా కార్టోగ్రఫీ నేర్చుకుంది. మహిళలు అరుదుగా ఉండే ఈ భూగోళ శాస్త్రం లాంటి చదువులో ఆ రోజుల్లోనే ఆమె మిచిగన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అవ్వటం చెప్పుకోదగిన విషయం.
1977 లో ప్రపంచంలో మొట్టమొదటి మహాసముద్ర భూగర్భ పటం తయారు చేసిన ఘనత కూడా మేరీ థర్ప్ కు సొంతం

బ్రూస్ హీజెన్ తో మేరీ థర్ప్
అప్పట్లో ప్రముఖ భూగర్భ శాస్త్రవేత్త అయిన బ్రూస్ హీజెన్ తో యూనివర్సిటీ లో మేరీ థర్ప్ కు పరిచయం ఏర్పడింది. తరువాత థర్ప్ హీజెన్ తో పనిచేయడం తన జీవితంలో పెద్ద మలుపు.
అట్లాంటిక్ మహాసముద్రం పై బ్రూస్ హీజెన్ ఎంతో డేటా ని సేకరించినప్పటికీ అందులో దాగిఉన్న రహస్యం తాను కొనుక్కోలేకపోయాడు. ఆ డేటా ను పరిశీలించిన మేరీ థర్ప్ మాత్రం ఒక పెద్ద విషయాన్ని కనుక్కోగలిగింది. ఆ తరువాత మేరీ థర్ప్ మధ్య అట్లాంటిక్ శిఖరం తొలిసారిగా కనుగొని శాస్త్రీయ సంఘం మొత్తం తల తన వైపు తిప్పేలా చేసింది. ఇది సాధారణమైన విషయం కాదు, మేరీ థర్ప్ కనుక్కున్న మధ్య అట్లాంటిక్ శిఖరం(Mid Atlantic Ridge) అంతకముంది కేవలం థియరీ కింద పరిగణించబడిన కాంటినెటల్ డ్రిఫ్ట్ థియరీ(భూఖండ చలనము) ని నిజమే అని నిరూపించింది.

నవంబర్ 19న గూగుల్ మేరీ థర్ప్(Marie Tharp) మీద గూగుల్ డూడుల్(Google Doodle) ఎందుకు విడుదల చేసింది అంటే… సరిగ్గా ఈ రోజు 1995 లో, మేరీ థర్ప్(Marie Tharp) తాను తాయారు చేసిన వెల కట్టలేని ఎన్నో మ్యాప్స్ ని అమెరికాకు చెందిన లైబ్రరీ అఫ్ కాంగ్రెస్ కి విరాళంగా ఇచ్చేసింది. దానికి బదులుగా లైబ్రరీ అఫ్ కాంగ్రెస్ ఆమెని 20వ శతాబ్దంలో అత్యంత ముఖ్యమైన కార్టోగ్రాఫర్ అని ప్రకటించింది.