Bigg Boss Telugu OTT: ఓటిటి బిగ్ బాస్ షో నెమ్మది నెమ్మదిగా సాగుతోంది. విజయవంతంగా తొలి వారం పూర్తి చేసుకోవడం జరిగింది. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్… నో కమా, నొ ఫుల్ స్టాప్ అంటూ ప్రారంభమైన ఈ షో తొలివారంలోనే… అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. మాజీ బిగ్ బాస్ సభ్యులకి కొత్తగా వచ్చిన వాళ్ళకి మధ్య రసవత్తరమైన పోరు సాగింది. చాలావరకు కొత్తగా వచ్చిన వాళ్ళు తమదైన శైలిలో గేమ్ ఆడుతూ ఉన్నారు. డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ఈ షోకి ఓ మాదిరి ప్రేక్షకాదరణ లభిస్తుంది.
టెలివిజన్ షోలో 24 గంటలు జరిగేది ఒక గంట ఎపిసోడ్ మాత్రమే చూపించిన.. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఆ ఇంట్రెస్ట్ 24/7 ఓటిటిలో పెద్దగా కలగడం లేదు…అని బయట జనాల టాక్. ఇదిలా ఉంటే మొదటి వారం ఓటిటి బిగ్ బాస్ షో.. విజయవంతంగా ముగియటంతో… ఆరుగురు ఎలిమినేషన్ లో ఉన్న తరుణంలో… ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నదానిపై బయట భారీగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం.
నటరాజ్, అరియానా, సరయు, హమీద, ముమైత్ ఖాన్, మిత్రా శర్మ, ఆర్జే చైతు ఎలిమినేషన్ లో ఉండగా… ఓటింగ్ ప్రక్రియ చివరి లో ముమైత్ ఖాన్.. మిత్రశర్మ పోటీపడగా.. చివరి నిమిషంలో ముమైత్ ఖాన్.. చివరిలో ఉండిపోయిన్నట్లు… వార్తలు వస్తున్నాయి. మరి ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవుతుందా లేదా అనేది.. ఈరోజు తేలనుంది. వాస్తవానికి మిత్రశర్మ వెళ్ళిపోతుందని శుక్రవారం దాకా అందరూ అనుకోగా చివరిలో ఓటింగ్ తారుమారు అయినట్లు దీంతో ముమైత్ ఖాన్ ఇంటినుండి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది.