Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ షోలో… ఈసారి అందరికీ తెలిసిన పాపులర్ వ్యక్తులను హౌస్ లోకి పంపించాలని అనుకుంటున్నారట. గత ఏడాది సీజన్ ఫైవ్ లో… హౌస్ లో చాలామంది తెలియనివారు కంటెస్టెంట్ లుగా అడుగుపెట్టడంతో .. పెద్దగా టిఆర్పి రేటింగులు నమోదు కాలేదు. ఇక అదే సమయంలో ఐపీఎల్ మ్యాచ్ లు కూడా స్టార్ట్ అవడంతో… పాటు మరో పక్క ఎన్టీఆర్ “ఎవరు మీలో కోటీశ్వరుడు” షో ప్రసారం అవుతూ ఉండడంతో సీజన్ ఫైవ్ బిగ్ బాస్ షో.. అంతగా అలరించలేనీ పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే సమయంలో “మా టీవీ” యాజమాన్యం కూడా… వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు వంటి ప్రయోగాలు చేయకుండా చేతులెత్తేసింది.
కానీ సీజన్ సిక్స్ పై మాటీవీ యాజమాన్యం గట్టిగా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది తెలుగు బిగ్బాస్ హౌస్ లోకి సీనియర్ యాక్టర్ లను పంపించే క్రమ్మంలో ఈ సారి హౌస్ లోకి ప్రభాస్ శ్రీను నీ.. తీసుకురావడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైతే ప్రభాస్ చేత రెకమండేషన్.. చేయించి వోపించి…హౌస్ లోకి… తీసుకొచ్చే ఆలోచనలో మాటీవీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
గతంలో హౌస్ లోకి సీనియర్ యాక్టర్ లు సమీర్, అమ్మ రాజశేఖర్, ఇంకా చాలామంది తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. ఇప్పుడు ఇదే రీతిలో.. ప్రభాస్ శ్రీను నీ… తీసుకొచ్చే ఆలోచనలో స్టార్ మా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ని వస్తే కచ్చితంగా ప్రభాస్.. సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంతో గ్యారెంటీగా ఓట్లు మరియు కాల్స్ బీభత్సంగా వస్తాయని.. షోకి మంచి ఆదరణ ఉంటుందని… “స్టార్ మా” ప్లాన్.