777 Charlie: కిరాక్ పార్టీ ఫిలిం కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం 777 చార్లీ.. నేడు రక్షిత్ శెట్టి తన 38వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా ఈ చిత్ర తెలుగు టీజర్ ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశారు.. ఈ టీజర్ విడుదల చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు నాని..

టీజర్ ని పంచుకుంటూ రక్షిత్ ఇలా అన్నారు.. మీరు మా ప్రేమను, ప్రేమతో స్వీకరిస్తారని మేము ఆశిస్తున్నాము.. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ను కే కిరణ్ రాజ్ దర్శకత్వం వహిస్తూ.. రక్షిత్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేశారు.. ఈ సినిమాలో హీరో ఒక కుక్క తో సావాసం చేస్తాడు.. అయితే టీజర్ చివర్లో హీరో రక్షతి పైకి తిరగబడడం ఆశ్చర్యాన్ని కలిగించింది.. మొత్తానికి టీజర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. పిల్లలు కూడా విని ఆనందిస్తారు. నోబెల్ పాల్ సంగీతం విజువల్స్ ను అందించారు.. దాదాపూర్ ఈ సినిమా షూటింగ్ పూర్తికావచ్చింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఉంది.