Russia Ukraine War: ఉక్రెయిన్ కు ఆత్యాధునిక యుద్ద ట్యాంకులు సరఫరా చేయాలని అమెరికా, జర్మనీ నిర్ణయించిన నేపథ్యంలో ఆ దేశంపై రష్యా మరో సారి క్షిపణి దాడులకు దిగింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు ఒడెస్సా ప్రాంతాలపై పదుల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్ లను ప్రయోగించింది రష్యా. కీవ్ వెలుపల ఉన్న హ్లెవాఖా పట్టణంపై రష్యా క్షిపణి దాడి ఘటనలో 11 మంది మరణించారు. ఈ దాడుల్లో మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఒడెసాలోని నల్ల సముద్రం ప్రాంతంలో ఇంథన ట్యాంకులపై రష్యా దాడి చేసింది. ఉక్రెయిన్ రాజధాని కైవ్ లో ఒకరు మరణించారు. రష్యా క్షిపణుల దాడితో ప్రజలు మెట్రో స్టేషన్ లలో తలదాచుకున్నారు. రష్యా క్షిపణుల దాడుల్లో 11 మంది మరణించారని ఉక్రెనియన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ టెలిగ్రామ్ లో తెలిపింది. ఒడెస్సాలో రెండు విద్యుత్ కేంద్రాలు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కీవ్ తో పాటు ఒడెస్సా వినిత్సియా ప్రాంతాల్లో విద్యుత్ కోతలు విధించారు. రష్యా సైన్యం దేశంపై ప్రయోగించిన 55 క్షిపణుల్లో 47 క్షిపణులను ఉక్రెయిన్ వైమానక రక్షణ దళాలు కూల్చివేసినట్లు ఉక్రెయిన్ టాప్ జనరల్ పేర్కొన్నారు.
కాగా మార్చి నెలాఖరు, లేదా ఏప్రిల్ ప్రారంభం నాటికి ఉక్రెయిన్ కు లెపర్ట్ – 2 యుద్ద ట్యాంకులు చేరవేస్తామని జర్మనీ రక్షణ శాఖ మంత్రి బోరిన్ పిస్టోరియస్ తెలిపారు. మరో పక్క పాలస్తీనాపై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. వెస్ట్ బ్యాంక్ లో ఇజ్రాయిల్ సైన్యం జరిపిన ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయని పాలస్తీనా అధికారులు తెలిపారు.
సుప్రీం కోర్టుకు చేరిన ఢిల్లీ మేయర్ ఎన్నిక పంచాయతీ
Russia fired a barrage of missiles and drones across Ukraine, killing at least 11 people, officials said, a day after Kyiv won Western pledges of battlefield tanks to combat Moscow's invasion https://t.co/CtjZJEyvwm pic.twitter.com/hsgQyp9R8W
— Reuters (@Reuters) January 27, 2023