Bigg Boss 5 Telugu: సిరి విషయంలో సరియు చెప్పింది కరెక్టే అంటున్న ఆడియన్స్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ సీజన్ ఫైవ్ లో హౌస్ నుండి తొలిసారి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సరియు. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించిన సరియు.. హౌస్ లో అడుగు పెట్టక ముందు దాదాపు వంద రోజులు కచ్చితంగా ఉంటాను అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పడం జరిగింది. కానీ తీరా చూస్తే ఆట మొదలైన వారం రోజులకే.. సరియు ఇంటికి వెళ్ళిపోయింది. అనంతరం అనేక ఇంటర్వ్యూలు బయట ఇస్తున్న సరియు మొట్టమొదటి ఇంటర్వ్యూలో సిరి పై కాంట్రవర్సీ కామెంట్లు చేయడం తెలిసిందే. మగవాళ్ళని అడ్డంపెట్టుకుని.. సేఫ్ గేమ్ ప్లే చేస్తుంది అని.. ఈ క్రమంలో సన్నీని పనిచేస్తుంది అని కూడా కామెంట్లు చేయడం జరిగింది.

Bigg Boss 5 Telugu : క‌న్నీళ్లు పెట్టుకున్న సిరి.. స‌ర‌యు ఆ మాట అన‌డంతో..

ఇదిలా ఉంటే శనివారం జరిగిన ఎపిసోడ్ లో.. హౌస్ లో … “పంతం నీదా నాదా సై” టాస్క్ లో…సిరి టీ షర్ట్ లో నుండి పిల్లో .. అప్పట్లో సన్నీ తీసినట్లు.. అతని పై దారుణంగా సిరి.. కామెంట్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో షణ్ముఖ్ జస్వంత్ కూడా..సిరి టీం కావటంతో సన్నీ ఆమె షర్ట్ లోపల చెయ్యి పెట్టి నట్లు భావిస్తాడు. కానీ అదే సమయంలో సన్నీ తో పాటు శ్వేతా కూడా సిరి దగ్గర ఉన్న పిలో లాకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటది. అయితే ఆ సిచువేషన్ కి సంబంధించి.. నాగార్జున శనివారం జరిగిన ఎపిసోడ్ లో.. వీడియో ప్లే చేయడం జరిగింది. ఈ క్రమంలో నాగార్జున సిరిని..సన్నీ నీ షర్ట్‌లో చేయిపెట్టడం నిజమేనా? నువ్ హౌస్‌లో చేస్తున్నవన్నీ రైట్ అని అనుకుంటున్నావా? అని ప్రశ్నించారు నాగ్. దానికి సిరి అవును చేయి పెట్టి తీశాడు’ అని చెప్పింది. ఆ సమయంలో శ్వేతా కూడా అక్కడే ఉంది అని చెప్పింది సిరి.

 

 ఇదే ప్రశ్న శ్వేతను అడగగా.. సన్నీ చేయిపెట్టడం నేను చూడలేదు అని అంది శ్వేత. షణ్ముఖ్ నువ్ చూశావా?? ఆమె టీషర్ట్‌లో సన్నీ చేయిపెట్టాడా? అని అడగడంతో.. అవును సార్ అతని చేయిని టీషర్ట్ లోపల చూశా అని చెప్పాడు. ఇదంతా ఎందుకులే అని వీడియో ప్లే చేసి చూపించాడు నాగ్. అయితే ఆ వీడియోలో సన్నీ చేపట్టలేదు అతని పక్కనే ఉన్న.. శ్వేతా సిరి షర్ట్ లో చేయి పెట్టి..పిల్లో తీసుకున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. దాంతో వెంటనే సిరి తనకి గేమ్ ఆడుతున్న టైం అర్థం కాలేదని వెంటనే మాట మారుస్తూ వెళ్లి సన్నీకి సారీ చెప్పడం జరుగుతుంది. మరోపక్క కావాలని సిరి మైండ్ గేమ్ ప్లే చేస్తుంది అంటూ.. శనివారం ఎపిసోడ్ లో సన్నీకి సిరి సారి చెప్పడం పై.. బయట జనాలు కామెంట్లు చేస్తున్నారు.

అదే రీతిలో కచ్చితంగా సిరి విషయంలో సరియు చెప్పింది కూడా చాలా కరెక్ట్ అని సిరి కన్నింగ్ గేమ్ ఆడుతుంది అంటూ.. డైలాగ్ లు వేస్తున్నారు.  సిరి పక్కా స్క్రిప్ట్ మైండ్ తో.. ఆడుతుందని ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండాలని.. తాజా వీడియో చూసిన తర్వాత బయట జనాలు కామెంట్ చేస్తున్నారు. ఆమె కాదు ఆమె పక్కనున్న వారికి కూడా చాలా ఎఫెక్టివ్.. షాకులు ఇచ్చే రీతిలో.. హౌస్ లో ఆడుతోందని ఆమె పక్కన ఉంటే ఖచ్చితంగా నెగటివ్ అవడం గ్యారెంటీ అని.. ఫస్ట్ వీక్లో జెస్సీని బలి చేయగా సెకండ్ వీక్లో షణ్ముఖ్ జస్వంత్ నీ..సిరి బలి చేసిందని భావిస్తున్నారు. ఏది ఏమైనా సిరి.. హౌస్ లో ఆడుతున్న తీరుపట్ల బయట నెగిటివ్ కామెంట్లు బలంగా వినబడుతున్నాయి.


Share

Related posts

పాపం..! టీఆరెస్ నాయకుల కక్కుర్తికి..! తేరుకోలేకపోతున్న కేసీఆర్..!!

Srinivas Manem

Decoration: ఇంట్లో  అలంకారం కోసం వీటితో తయారు చేయబడిన వస్తువులు అస్సలు ఉండకూడదు.. అలాగే అక్వేరియం కూడా ??

siddhu

Corona: క‌రోనా స‌మ‌యంలో అస్సలు చేయ‌కూడ‌ని ప‌ని ఏంటో తెలుసా?

sridhar