బిగ్ బాస్ ద్వారా విపరీతంగా ఫేమస్ అయిన కంటెస్టెంట్ లో సయ్యద్ సోహెల్ రియాన్ ఒకరు. అంతకు ముందే కొన్ని సినిమాల్లో, సీరియల్స్ లో నటించిన అతనికి బిగ్బాస్ లో వచ్చిన గుర్తింపు ఎక్కడా రాలేదు. గొడవ పడడం, త్యాగాలు చేయడం, ఎమోషనల్ అయిపోవడం అతని ప్రధాన లక్షణాలు. ఇక గ్రాండ్ ఫైనల్స్ లో నాగార్జున చెప్పిన డీల్ ఒప్పుకుని తొలిసారి అలా డబ్బులు తీసుకున్న కంటెస్టెంట్ గా రికార్డులకెక్కాడు.
ఈ నేపథ్యంలో ఈ షోలో అతను తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు లీక్ అయ్యాయి. సీక్రెట్ రూమ్ ద్వారా ఇంటి లోకి వెళ్ళిన సోహెల్ వచ్చీరావడంతోనే గొడవతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఫిజికల్ టాస్కుల్లో చాలా బాగా పర్ఫర్మ్ చేశాడు. అతను మాట్లాడే ‘కథ వేరే ఉంటది’ డైలాగ్ విపరీతంగా ఫేమస్ అయ్యింది. కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు… అందరితో ప్రేమగా ఉన్నాడు. ఇక అవసరమైనప్పుడు కోపం చూపిస్తూ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడమే కాకుండా అందరితో సరదాగా జోకులు వేస్తూ ఫన్నీగా కూడా ఉండేవాడు.
ఇకపోతే ఇంటిలో చివరి వరకు కొనసాగిన ఈ రోజుకు రూ. 25000 తీసుకున్నట్లు చెప్పారు. అంటే మొత్తంగా రూ. 26,25,000 అతను అందుకున్నాడని సమాచారం. ఇక బిగ్బాస్ ఇచ్చిన రు. 25 లక్షలు కలుపుకుంటే అతడికి వచ్చింది 51 లక్షల 25 వేలు. దీంతోపాటు ఫేమస్ అయ్యాడు హీరోగా ఒక్క సినిమా కూడా ఫిక్స్ అయిపోయింది. నాగార్జున అతని పేరు మీద ఇచ్చిన 10 లక్షలతో కలిపి మొత్తం 61 లక్షల రూపాయలకు పెరిగింది. తర్వాత అభిజిత్ తర్వాత ఎక్కువ మొత్తం అందుకున్న కంటెస్టెంట్ గా సోహెల్ నిలిచాడు.