ఈ వీడియో చూశారంటే కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు!

Share

అమ్మ‌.. ప‌ల‌క‌డానికి రెండ‌క్ష‌రాల ప‌ద‌మే కావొచ్చు.. కానీ త‌ను చేసే త్యాగం అంతా ఇంతా కాదు. త‌న అందాన్ని త‌న పిల్ల‌ల్లో చూసుకునే ఒక దేవ‌త‌. త‌న బిడ్డ‌ల‌కు క‌ష్టం వ‌స్తే.. త‌న క‌ళ్ల‌నుంచి నీళ్లు వ‌స్తాయి. త‌ను చ‌చ్చినా స‌రే త‌న పిల్ల‌ల‌ను మాత్రం బాగుండాలని కోరుకునే ప్రేమ త‌న‌ది.. ఆ ప్రేమ మనుషుల్లోనే కాదు.. జంతువుల్లో కూడా అలాగే ఉంటుంది. ఈ విషయం పలు సార్లు బయటపడుతునే ఉంది.

ప్రతీ తల్లి తన పిల్లలపై అమితమైన ప్రేమను కురిపిస్తునే ఉంటుంది. రోజూ కంటికి రెప్పలా కాపాడుతునే ఉంటుంది. ఇలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. తన పిల్లలను తినేందుకు వచ్చిన పాము నుంచి పిల్లలను కాపాడింది ఒక తల్లి బాతు. తర్వాత తానే ఆ పాముకు ఆహారం అయిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని కంట తడిపెట్టిస్తోంది. అయ్యో పాపం.. అంటూ అందరూ జాలి పడుతున్నారు.

అందరినీ ఏడిపిస్తున్న ఈ వీడియోను ఐఎఫ్ ఎస్ ఆఫీసర్ సుధారామెన్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ప్రకృతి ధర్మాల కంటే.. తల్లి ప్రేమ చాలా గొప్పది అని ఆమె వీడియోకు కాప్షన్ పెట్టారు. ఈ వీడియోలో చాలా పిల్ల బాతులతో ఒక తల్లి బాతు ఒక గొయ్యిలో ఉంది. పిల్ల బాతుల అరుపులు విన్న పాము అక్కడకు వచ్చింది.

ఇక నాకు మంచి భోజనం దొరికింది అనుకుందో ఏమో.. వేంటనే ఆ బాతుల దగ్గరకు వచ్చేసింది. ఆ పామును చూసిన బాతు వెంటనే అలర్ట్ అయింది. దాంతో గొయ్యి లోనుంచి వాటిని బలవంతంగా బయటకు పంపింది. ఆ బాతు పిల్లలను వెనక్కి రావద్దొంటూ… గట్టిగా అరుస్తూ పంపేసింది. అంతలోనే ఆ పాము తల్లి బాతు చుట్టూ చుట్టుకుంటూ మింగేసేందుకు రెడీ అయ్యింది. ఇలా పిల్లల కోసం ఆ తల్లి బాతు తన ప్రాణాలను త్యాగం చేసింది.


Share

Related posts

రామ జన్మభూమి గురించి ఫుల్ చరిత్ర మీకోసం !

Kumar

ఇండస్ట్రీ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన గెటప్ శ్రీను..!!

sekhar

ఇంటర్ పాస్ అయ్యారా..? అయితే పదండి.. అమెజాన్ కంపెనీ ఉద్యోగం ఇస్తుందట…!

arun kanna