Aquaman 2 OTT: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది. థియేటర్లలో రిలీజ్ అయిన ఐదు నెలల అనంతరం ఈ మూవీ ఓటిటిలో సందడి చేయనుంది. మే 21 నుంచి జియో సినిమా ఓటీటీ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. జియో ఓటిటిలో ఈ హాలీవుడ్ మూవీ నీ ఫ్రీగా వీక్షించవచ్చు. జియో ప్రీమియర్ సబ్స్క్రైబర్లు ఎటువంటి యాడ్స్ లేకుండా సినిమాను చూసే విసురుబాటు ఉంది. ప్రీమియర్ సబ్స్క్రిప్షన్ లేని వారి కోసం యాడ్స్ తో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది జియో సినిమా. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు మరో ఓటిటిలోకి కూడా ఈ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తుంది. 2018 లో రిలీజ్ అయిన అక్వామెన్ కు సీక్వెల్ గా ఈ మూవీ రూపొందింది.
థియేటర్లలో మిక్స్డ్ టాక్ ను దక్కించుకున్న ఈ చిత్రం నిర్మాతలకు మాత్రం లాభాలను తెచ్చిపెట్టింది. 215 మిలియన్ల బడ్జెట్తో రూపొందిన ఈ సీక్వెల్ 435 మిలియన్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇండియాలో ఈ చిత్రం సీక్వెల్ తో పాటు డంకీ, సలార్ ఒకేసారి థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఇక ఈ ఇండియన్ సూపర్ స్టార్ లతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పోటీ పడింది. తొలిరోజు రెండు కోట్లలోపే కలెక్షన్స్ రాబట్టింది. నెగిటివ్ టాక్ రావడంతో ఈ మూవీకి దెబ్బ పడింది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ కు సగం కూడా కలెక్షన్స్ రాలేదు.
ఆక్వామన్ క్యారెక్టర్ జోసన్ మోమోవా పై తర్కెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. యుద్ధంలో తన సోదరుడు ఓరమ్ నో ఓడించిన అక్వామెన్ అలియాస్ ఆర్ధర్ కర్రీ అట్టాంటిస్ కు రాజు అవుతాడు. మోరా ను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఆక్వామెన్ తో పగతో రగిలిపోయిన డేవిడ్ కేన్.. బ్లాక్ ట్రైడెంగ్ సహాయంతో కొత్త శక్తులను కూడగట్టుకుని అక్కామెన్ తిరిగి యుద్దానికి వస్తాడు. డేవిడ్ ను అక్కా మెన్ ఎలా ఎదుర్కొన్నాడు? ఈ పోరాటంలో ఎవరు గెలిచారు? అని కథ చుట్టూ ఈ మూవీ రూపొందింది. ఇక కథనాలతో పాటు యాక్షన్ ఎమోషన్స్ కు పెద్దపీట వేశారు మేకర్స్. కానీ సెకండ్ పార్ట్ లో ఆ మ్యాజిక్ మిస్ అయింది.
కంప్లీట్ గా ప్రివెంజ్ డ్రామాగా ఈ మూవీ రూపొందింది. మొత్తానికి అయితే థియేటర్లు వద్ద మిక్స్డ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ మూవీ మంచి జోరును చూపించింది. ఇక ఇతర ఇండస్ట్రీలలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ మరియు షారుక్ ఖాన్ ని ఢీ కొట్టడం అంటే మామూలు విషయం కాదనే చెప్పుకోవచ్చు. వీరిద్దరిని ఢీ కొట్టి ఈ మూవీ ఇంత మేరా వసూలు రాబట్టడం అంటే గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ మూవీ థియేటర్లలో అయితే మంచి వసూళ్లను రాబట్టి నిర్మాతలను ఆదుకుంది. మరొక ఓటిటిలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!