NewsOrbit
న్యూస్

కొల్లు రవీంద్ర బయటకి వచ్చే ఛాన్స్ స్పష్టంగా ఉన్నా.. కావాలని అడ్డం పడుతోంది ఎవరు?

కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. మేకా భాస్కర‌రావు హ‌త్య కేసులో ర‌వీంద్రను ఏ-4 గా చేర్చిన పోలీసులు ప్రస్తుతం జైల్లో ఉంచారు! ఆ సంగతులు అలా ఉంచితే… కొల్లు రవీంద్ర అరెస్టుపై మొదటి రెండు రోజులూ… “బీసీలపై దాడులు”గా అభివర్ణించిన బాబు & కో వాస్తవాలు తెలుసుకున్నారో ఏమో కానీ అనంతరం మౌనం దాల్చారు! ఇక కేసు కూడా బలంగా, పక్కాగా ఉండటం.. మరణించిన వ్యక్తి అధికారపార్టీ నాయకుడు అవ్వడం, పైగా మంత్రి ప్రధాన అనుచరుడు అవ్వడంతో.. ప్రభుత్వం ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలే సూచనలు లేవు! కాబట్టి… హూ ఈస్ నెక్స్ట్ అనే ఆలోచనలో బందరు తెలుగు తమ్ముళ్లు ఉన్నారని అంటున్నారు స్థానిక తమ్ముళ్లు!

కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేసింది చిన్నా చితకా కేసులో కాదు కాబట్టి… ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు లేవని, ఉన్నా వద్దన్న రేంజ్లో ఫిక్సయిపోతున్న ఇద్దరు నేతలు… అప్పుడే ఆ సీటుకోసం పోటీపడిపోతున్నారంట. ఆ సీటును ఎలా సాధించాలనే విషయంలో స్కెచ్ లు కూడా గీస్తున్నారని అంటున్నారు! ఈ క్రమంలో బీసీ సామాజికవర్గంలో – మత్స్యకార కోటాలో కొల్లు ఈ సీటును 2014 – 2019ల్లో వరుసగా సంపాదించుకోగలిగారు. కాబట్టి.. తనుకూడా బీసీనే కాబట్టి ఈసారి బీసామాజికవర్గంలో – యాదవ కోటాలో ఈ సీటు ఎగరేసుకుపోవాలని భావిస్తున్నారట జిల్లా టీడీపీ అధ్యక్షుడు బ‌చ్చుల అర్జునుడు! గ‌త నాలుగు సార్లుగా బంద‌రు ఎమ్మెల్యే సీటు కోసం విశ్వ ప్రయ‌త్నాలు చేసి ఫెయిల్ అయిన ఆయన.. ఈసారి మాత్రం ఫెయిల్ అవ్వనని చెబుతున్నారంట!

ఇదే క్రమంలో మ‌చిలీప‌ట్నం మాజీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ కూడా ఈ సీటుకోసం తన సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు బందరు వాసులు! 2009 ఎన్నిక‌ల నుంచే వీరు ఈ సీటు కోసం ప్రయ‌త్నాలు చేస్తున్నా… మ‌త్స్యకార వ‌ర్గానికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండ‌డంతో బాబు ఫోన్ రవీంద్రకే మోగుతుంది! దీంతో కొన‌క‌ళ్ల నారాయ‌ణ త‌న కుమారుడి కోసం ఈ సీటును రిజర్వ్ చేసుకునే ప్రయ‌త్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు!! మరి అరెస్టయిన పార్టీనేత, మాజీమంత్రి సంగతి పక్కనపెట్టి… ఇలా ఆయన బయటకు రాకపోతే బాగుండు… ఆ సీటును పోందొచ్చు అనేస్థాయిలో టీడీపీ నేతలు ఆలోచనలు చేయడంపై బందరు తమ్ముళ్లు ముక్కున వేలేసుకుంటున్నారట!

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju