NewsOrbit
Featured న్యూస్ హెల్త్

విట‌మిన్ C ఎక్కువ‌గా ఉండే టాప్ 10 ఆహారాలు ఇవే..!

మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు విట‌మిన్ సి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. విట‌మిన్ సి వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. కంటి చూపు పెరుగుగుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అయితే క‌రోనా నేప‌థ్యంలో చాలా మంది విట‌మిన్ సి ఉన్న ఆహారాల‌ను తినేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. అలాంటి వారి కోసం విట‌మిన్ సి అధికంగా ఉంటే టాప్ ఆహారాల గురించి కింద ఇస్తున్నాం. వీటిని నిత్యం తీసుకోవ‌డం ద్వారా శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క‌రోనా నుంచి జాగ్ర‌త్త‌గా ఉండ‌వ‌చ్చు.

top 10 vitamin c foods

1. జామకాయ‌

జామ‌కాయ‌లను కొంద‌రు ప‌చ్చిగా ఉంటే ఇష్ట‌ప‌డ‌తారు. కొంద‌రు బాగా పండిన జామ‌కాయ‌ల‌ను తింటారు. అయితే ఎలా తిన్నా స‌రే.. వీటి వ‌ల్ల మ‌న‌కు విట‌మిన్ సి ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఒక జామ‌కాయ‌ను తింటే మ‌న‌కు రోజుకు కావల్సిన విట‌మిన్ సిలో దాదాపుగా 63 శాతం వ‌ర‌కు అందుతుంది. 2 జామ‌కాయ‌ల‌ను తింటే రోజు మొత్తానికి స‌రిప‌డా విట‌మిన్ సి మ‌న‌కు ల‌భించిన‌ట్లే. క‌నుక వీటిని నిత్యం తిన‌డం ద్వారా రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు.

2. ప‌సుపు రంగు క్యాప్సికం

క్యాప్సికం మ‌న‌కు ఎరుపు, ఆకుప‌చ్చ‌, ప‌సుపు రంగుల్లో ల‌భిస్తుంది. అన్నింటిలోనూ ప‌సుపు రంగు క్యాప్సికంలోనే మ‌న‌కు విట‌మిన్ సి ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ఒక పెద్ద క్యాప్సిక్సంలో 341 మిల్లీగ్రాముల వ‌ర‌కు విట‌మిన్ సి ఉంటుంది. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

3. కొత్తిమీర

ఒక క‌ప్పు కొత్తిమీర‌ను తీసుకుంటే నిత్యం మ‌న‌కు కావ‌ల్సిన విట‌మిన్ సి క‌న్నా 33 శాతం ఎక్కువగానే ల‌భిస్తుంది. అంటే.. ఒక క‌ప్పు విట‌మిన్ సితో మ‌న‌కు 133 శాతం వ‌ర‌కు విట‌మిన్ సి ల‌భిస్తుంద‌న్న‌మాట‌. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డ‌మే కాదు, జీర్ణ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.

4. కివీ

విట‌మిన్ సి అధికంగా ఉండే పండ్ల‌లో కివీ పండ్లు ఒక‌ట‌ని చెప్ప‌వ‌చ్చు. సాధార‌ణంగా డెంగ్యూ వ‌చ్చే పేషెంట్లు ప్లేట్‌లెట్లు అధికంగా పెర‌గ‌డం కోసం వీటిని తింటారు. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో శ‌రీర రోగ నిరోధ‌క‌శ‌క్తిని పెంచుకునేందుకు కూడా వీటిని తిన‌వ‌చ్చు. ఒక కివీ పండులో 273 మిల్లీగ్రాముల వ‌ర‌కు విట‌మిన్ సి ఉంటుంది. ఇది మ‌న‌కు ఒక రోజుకు స‌రిపోతుంది.

5. బొప్పాయి

ఒక క‌ప్పు బొప్పాయి పండు ముక్కల‌ను తింటే మ‌న‌కు రోజుకు స‌రిపోయే విట‌మిన్ సి ల‌భిస్తుంది. బొప్పాయిలో ఉండే విట‌మిన్ ఎ, ఫొలేట్‌, ఫైబ‌ర్‌, కాల్షియం, పొటాషియంలు పోష‌ణ‌ను ఇస్తాయి.

6. స్ట్రాబెర్రీలు

ఒక క‌ప్పు స్ట్రాబెర్రీల‌ను తింటే రోజుకు కావ‌ల్సిన విట‌మిన్ సి మ‌న‌కు ల‌భిస్తుంది. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

7. నారింజ

ఒక మీడియం సైజు నారింజ పండును తింటే మ‌న‌కు రోజుకు కావ‌ల్సిన విట‌మిన్ సి ల‌భిస్తుంది. దీన్ని పండు రూపంలో లేదా జ్యూస్ తీసుకుని కూడా తాగ‌వ‌చ్చు. దీంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

8. నిమ్మ‌పండ్లు

ఒక నిమ్మ పండులో 29.1 మిల్లీగ్రాముల వ‌ర‌కు విటమిన్ సి ఉంటుంది. నిమ్మ‌పండ్ల ర‌సాన్ని నిత్యం ప‌లు హెర్బ‌ల్ టీల‌లో క‌లుపుకుని తాగితే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

9. పైనాపిల్

ఒక క‌ప్పు పైనాపిల్ పండ్ల ద్వారా మ‌న‌కు రోజుకు స‌రిప‌డా విట‌మిన్ సి ల‌భిస్తుంది. అలాగే విట‌మిన్ ఎ, కాల్షియం, పొటాషియం, ఫైబ‌ర్‌లు కూడా వీటిల్లో ఎక్కువ‌గానే ఉంటాయి.

10. ఉసిరి

ప్ర‌స్తుతం ఉసిరికాయ‌ల‌కు సీజ‌న్ కాదు. అయినా మార్కెట్‌లో మ‌న‌కు ఉసిరి కాయ జ్యూస్ రెడీమేడ్‌గా దొరుకుతోంది. దాన్ని నిత్యం తాగ‌వ‌చ్చు. దీంతో విట‌మిన్ సి పుష్క‌లంగా ల‌భిస్తుంది. శరీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N