NewsOrbit
న్యూస్

కోర్టులపై వైసీపీ సైలెంట్ కి బ్రేకులు వేసిన ఎమ్మెల్సీ..!

mlc pandula ravindrababu comments on courts irks jagan

వైసీపీ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బలు పడటం కామన్ అయిపోయింది. ప్రభుత్వం ఏర్పాటైన ఈ 14 నెలలు దాదాపు 75 అంశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వచ్చాయి. వీటిపై వైసీపీ నేతలు చంద్రబాబుతోపాటు ఏకంగా కోర్టులపై కూడా విమర్శలు చేస్తున్నారు. తీర్పులిచ్చిన న్యాయమూర్తులపై కూడా విమర్శలు చేసి కోర్టు నోటీసులు అందుకున్నారు. డాక్టర్ సుధాకర్, నిమ్మగడ్డ వ్యవహారంలో కోర్టు తీర్పులను తప్పుబట్టి జడ్జిలపై వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ నాయకులకు జగన్ పై ఉన్న ప్రేమ ముందు రాజ్యాంగ వ్యవస్థలు, కోర్టుల ముందు తక్కువే అవుతున్నాయి. ప్రస్తుతం రాజధాని అంశంలో హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఇది జగన్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ. ఈ అంశంపై వైసీపీ నేతలు ఎవరూ మాట్లాడలేదు. కానీ.. ఓ ఎమ్మెల్సీ మాత్రం హైకోర్టుకు వ్యతిరేక వ్యాఖ్యలు చేసి రెచ్చిపోయారు.

mlc pandula ravindrababu comments on courts irks jagan
mlc pandula ravindrababu comments on courts irks jagan

ఆ ఎమ్మెల్సీ ఏమన్నారంటే..

పండుల రవీంద్రబాబు అందరికీ తెలిసిన పేరే. అమలాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచారు. జగన్ అవకాశమివ్వటంలో ఎమ్మెల్సీగా మారారు. ఎంపీ కాకముందు సివిల్స్ అధికారి. సివిల్స్, ఐటీల్లో ఉన్నత హోదాల్లో పనిచేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. మొదట్లో టీడీపీ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించారు. కానీ మొన్నటి ఎన్నికల్లో జగన్ కు జైకొట్టారు. ప్రస్తుతం రాజధానిపై కోర్టు తీర్పు అనంతరం పండుల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ‘కోర్టులు, జడ్జీలు, చంద్రబాబు అందరూ కలిసినా జగన్ వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఆర్డర్ పై వైసీపీ మంత్రులే సైలంట్ గా ఉన్న సమయంలో ఎమ్మెల్సీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగన్ పై విధేయత చూపేందుకే ఈ వ్యాఖ్యలు చేసుంటారనే నేతలు అభిప్రాయపడుతున్నారు. జడ్జీలపై ఇటువంటి వ్యాఖ్యలు జగన్ కు తలనొప్పులు తెచ్చిపెట్టేవే.

మిగిలిన నేతలు ఎందుకు సైలెంట్ అయినట్టు..

వైసీపీలో ఎటువంటి నిర్ణయమైనా.. కోర్టు నుంచి ఎటువంటి తీర్పులు వచ్చినా స్పందించే నాయకులు ఉన్నారు. రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ధర్మాన, అంబటి, బొత్స, అనిల్.. తదితరులు స్పందిస్తూ ఉంటారు. కానీ.. రాజధాని విషయంలో కోర్టుపై మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. మరి దీని వెనుక ఉద్దేశాలేంటనేది చర్చనీయాంశంగా మారింది.

 

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju