NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అందుకే రాజధాని మార్చేస్తున్నారు… అసలు స్టోరీ చెప్పిన…!!

మూడు రాజధానులు అంశం ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి గవర్నర్ ఆమోదం కూడా తెలపటంతో టిడిపి నేతలు రాజధాని వికేంద్రీకరణ అంశంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిలో భాగంగా నారా లోకేష్ ఏపీ సీఎం జగన్ పై ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని మార్పు అంశంపై స్పందించిన నారా లోకేష్ ట్విటర్లో  ప్రతిపక్షంలో జగన్ ఉన్న టైంలో ఏపీ రాజధాని లో వైసీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు అనేదాని గురించి చెప్పిన వీడియోను పోస్ట్ చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మిస్తే చంద్రబాబుకి పేరు వస్తుందనే భయంతో వైయస్ జగన్ రాజధాని మార్చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.

Watch: Nara Lokesh Reminding Uttara Kumarudu - Great Andhra ...ట్విట్టర్లో నారా లోకేష్ అసలు వైయస్ జగన్ ని ఉద్దేశించి ఏమన్నారంటే..”స్థానిక యువ‌త‌కు ఉపాధి క‌ల్ప‌న‌, సెల్ఫ్ ఫైనాన్స్ కేపిట‌ల్‌, గార్డెన్ సిటీ, లంగ్‌స్పేస్ తో ప్ర‌పంచానికే త‌ల‌మానికంగా న‌వ్యాంధ్ర‌కు రాజ‌ధానిగా మ‌ుహాన‌గ‌రం క‌డ‌తాన‌ని ఉత్త‌ర‌కుమార ప్ర‌గ‌ల్భాలు పలికారు. నువ్వేమైతే చెప్పావో వాటికంటే ఘ‌న‌మైన ల‌క్ష్యాల‌తో చంద్ర‌బాబు గారు నిర్మించిన అమ‌రావ‌తి ప్ర‌జారాజ‌ధానిని ఎందుకు ధ్వంసం చేయాల‌నుకుంటున్నారో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి.

మీరు క‌ట్టాల‌నుకున్న‌ రాజ‌ధాని కంటే గొప్ప‌ది. అమ‌రావ‌తి నిర్మాత‌గా చంద్ర‌బాబు గారి పేరు చ‌రిత్ర‌లో ఉండ‌కూడ‌ద‌ని మూడు ముక్క‌లాట‌తో విధ్వంసం సృష్టిస్తున్నారా? ఐదు కోట్ల‌ ఆంధ్రుల‌కు స‌మాధానం చెప్పి తీరాలి.” ఈ రకంగా పోస్ట్ పెట్టి అమరావతి నిర్మాణం అయితే క్రెడిట్ చంద్రబాబుకి వస్తుందన్న అక్కసుతో జగన్ రాజధానిని మార్చేస్తున్నారు అన్నట్టుగా లోకేష్ పేర్కొన్నారు. 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju