NewsOrbit
రాజ‌కీయాలు

కేంద్ర మంత్రికి సీఎం జగన్ ఘాటు లేఖ.. ఏం రాశారంటే..!

ap cm jagan strong reply to central minister

ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు రాజుకుంటున్నాయి. విభజన సమయం నుంచీ ఉన్న సమస్యలకు కొత్త ప్రాజెక్టుల విషయంలో వస్తున్న సమస్యలను ఇద్దరు సీఎంలు ఓ కొలిక్కి తీసుకురావడం లేదు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తోంది. కేంద్రం కూడా ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లొద్దని ఏపీకి లేఖ రాసింది. అపెక్స్ కౌన్సిల్ లో తీసుకున్న నిర్ణయాలు ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించింది. దీనికి సీఎం జగన్ కేంద్ర మంత్రికి ఘాటుగా లేఖ రాశారు. ఏపీలో చేపడుతున్న ప్రాజెక్టులు కొత్తవి కాదని.. గతంలోనే ప్రతిపాదించినవని రాశారు. మా వాటా జలాలనే మేము వాడుకుంటున్నామని కూడా రాశారు. ఇంతకీ జగన్ రాసిన లేఖలో ఏముందంటే..

ap cm jagan strong reply to central minister
ap cm jagan strong reply to central minister

కేంద్రమంత్రికి జగన్ రాసిన లేఖ సారాంశమిదే..

‘రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై ఏపీ స్పందన లేదంటూ ఈనెల 7న కేంద్రం రాసిన లేఖ సరికాదు. సమావేశంలో రాష్ట్రం తరఫున మాట్లాడేందుకు అజెండా కూడా ఖరారు చేశాం. కృష్ణా ట్రైబ్యునల్‌ ఇచ్చిన నీటి వాటాకు బద్ధులై ఉంటామని తెలంగాణ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో చెప్పింది. కేంద్రం రాసిన లేఖలో ప్రస్తావించిన ప్రాజెక్టులు ఏపీలో కొత్తవి కాదు. కృష్ణా ట్రిబ్యునల్‌ కేటాయింపుల ఆధారంగానే ప్రాజెక్టులు ఉన్నాయి. 2015లో కేఆర్‌ఎంబీ సమావేశంలోనూ తెలంగాణ, ఏపీ మధ్య అంగీకారం కుదిరింది. కృష్ణా నదీ నీటి పంపకాల్లో తెలంగాణ, ఏపీ మధ్య ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో ఉన్న ప్రాజెక్టులకు నీటిని అందించడంతో పాటు సమర్థంగా కాల్వల వ్యవస్థను వినియోగించుకోవడమే జరుగుతుంది. దీని వల్ల ఎలాంటి అదనపు ఆయకట్టు సాగులోకి రాదు’.

‘నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగదు. పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన నీటి వాటా వినియోగానికే ఎత్తిపోతల ప్రాజెక్ట్. కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, దిండి ఎత్తిపోతలకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలై ఉంది. ఆ రెండు ప్రాజెక్టులు  తెలంగాణలో కొత్త కాల్వ వ్యవస్థను, ఆయకట్టును సృష్టిస్తున్నాయి. ఈ నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిందిగా అపెక్స్‌ కౌన్సిల్‌ తెలంగాణను ఆదేశించలేదు. రెండో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనైనా ఈ అంశాలు పరిష్కారమవుతాయని భావిస్తున్నాం’ అని జగన్ తన లేఖలో ప్రస్తావించారు. గడచిన ఆరేళ్లలో ఇవే వివాదాలు నడుస్తున్నాయి. మరి ప్రస్తుతం ఇవి ఎలా టర్న్ తీసుకుంటాయో చూడాల్సి ఉంది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?