NewsOrbit
రాజ‌కీయాలు

సుజనా ఇక సైలెంట్ అయినట్టే..! కారణాలు చాలా..

sujana chowdary must be silent due to somu veerraju effect

టీడీపీ కంకణబద్దుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.. మరో విధంగా చెప్పాలంటే టీడీపీలో నెంబర్ టూ.. సుజనా చౌదరి ఏడాది క్రితం బీజేపీలో చేరారు. ఈ ఏడాది కాలంలో ఒక్కసారి కూడా బీజేపీకి అనుగుణంగా, ఆరెస్సెస్ వాదిగా ఎప్పుడూ మాట్లాడలేదు. చంద్రబాబు ఏమి మాట్లడతారో.. బీజేపీలో ఉంటూ సుజనా కూడా అదే మాట్లాడేవారు. ఇందుకు ఉదాహరణ అమరావతి అంశం. అమరావతి ఎక్కడికీ పోదు అంటూ చంద్రబాబు వాదననే వినిపించారు. కానీ.. ఇప్పుడు రాజధాని అమరావతి నుంచి తరలిపోయే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం కూడా మద్దతిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు సుజనా పరిస్థితి ఏంటి..?

sujana chowdary must be silent due to somu veerraju effect
sujana chowdary must be silent due to somu veerraju effect

సైలెంట్ గా లేకపోతే వేటు ఖాయమే..!

ఏపీకి బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడు మీద ఉన్నారు. ఎవరు గీత దాటినా, టీడీపీకి అనుకూలంగా ఉన్నా వేటు పడుతోంది. ఇప్పటికే వెలగపూడి రామకృష్ణ, ఓవీ రమణలపై వేటు వేశారు. ఇప్పుడు లంకా దినకర్ పేరు కూడా ఈ లిస్టులో ఉంది. వీరితోపాటు మరో ఇద్దరు కీలక నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరి తర్వాత సుజనా పేరు కూడా వినిపిస్తోంది. దీంతో సుజనా ఎట్టి పరిస్థితుల్లోనూ సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతం బీజేపీకి ఏపీలో బలపడటం ముఖ్యం. జనసేనతో కలిసి రెండో స్థానం దక్కించుకోవాలని దారులు పరుచుకుంటోంది. ఈ నేపథ్యంలో అడ్డుగా వస్తున్న టీడీపీని పక్కన పెట్టడానికి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంది. ఈ సమయంలో టీడీపీకి అనుకూలంగా మాట్లాడితే వారిపై వేటు వేయడానికి వెనుకాడటం లేదు. అది సుజనా చౌదరి కావొచ్చు.. మరెవరైనా కావొచ్చు.

author avatar
Muraliak

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !