NewsOrbit
ట్రెండింగ్ రివ్యూలు సినిమా

రివ్యూ : ‘జోహార్’ – నాలుగు జీవితాల ప్రయాణం సినిమాని గమ్యానికి చేర్చిందా…?

కొత్త దర్శకుడు తేజ మర్ని దర్శకుడిగా పరిచయమవుతూ నైనా గంగూలీ, చైతన్యకృష్ణ, ఎస్తర్ అనిల్, ఈశ్వరీరావు, శుభ లేఖ శుభాకర్ వంటి తారాగణం ప్రధానపాత్రలలో నటించిన సినిమా జోహార్‘. ఎంతో వినూత్నంగా ఉన్న టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా…. ఈ సినిమా కరోనా ప్రభావం వల్ల డైరెక్ట్ గా ‘ఆహా’ ఓటిటి ప్లాట్ ఫామ్ లోనికి రిలీజ్ అయింది. ఇక యంగ్ టాలెంట్, సీనియర్ తారాగణం కలిసి చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం

 

Johar Telugu Movie Review | 123telugu.com

కథ

ఈ సినిమా ఒక ఆంథాలజీ. అంటే ఒకేసారి పలు కథలను చూపించే సినిమా. ఆ కథల విషయానికి వస్తే….

రోడ్డుమీద సర్కస్ చేస్తూ పరుగుపందెంలో దేశం కోసం గోల్డ్ మెడల్ గెలవాలనుకుంటే అమ్మాయి బాల (నైనా గంగూలి)

ప్రాణం పోయినా తన హాస్టల్ లో పిల్లలకి సరైన వసతి కల్పించాలని…. ప్రభుత్వం నిధులు కోసం తిరిగే వ్యక్తి బోస్ (శుభలేఖ సుధాకర్)

ఉద్దానం కిడ్నీ సమస్య తో భర్తను పోగొట్టుకొని…. కూతురిని కూడా పోగొట్టుకునే పరిస్థితిలో ఉన్న తల్లి గంగమ్మ (ఈశ్వరీరావు)

చదువే జీవితం అనుకుని ప్రేమించిన వ్యక్తితో రాజముండ్రి పారిపోయిన వేశ్య కూతురు జ్యోతి (ఎస్తర్ అనిల్).

ఇలా నాలుగు భిన్నమైన జీవితాలు ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా నడుస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అచ్యుతరామయ్య చనిపోవడంతో ఆ స్థానంలో కి వచ్చినన తన వారసుడు సీఎం విజయ్ వర్మ (చైతన్యకృష్ణ) తన పార్టీ పరువు, తన తండ్రి ఖ్యాతిని ప్రపంచమంతా తెలియజేయాలని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ నిర్ణయం వల్ల ఆ నలుగురి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయి…? వారి సమస్యలకు పరిష్కారం దొరికిందా లేదా…? అసలు రాష్ట్ర సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలకు జరిగిన నష్టం ఏమిటి? అన్నది కథ.

Esther Anil, Naina Ganguly from Johar Movie | Hollywood studio ...

ప్లస్ పాయింట్స్

అనుభవలేమి నటీనటులు సైతం అబ్బురపరిచే నటన

డైలాగ్స్

ఎమోషనల్ సీన్స్

కథాంశం

మ్యూజిక్, సినిమాటోగ్రఫీ

మొదటి అర్ధ భాగం క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

ఊహాజనిత రెండవ అర్ధ భాగం

మరి కొంచెం లోతుగా విశ్లేషించిన కథనం

ఎంటర్టైన్మెంట్ అంత లేకపోవడం

Popular production house bags the rights of Johar | Telugu Movie ...

విశ్లేషణ

మొదటిగా డైలాగ్ రైటర్ రామకృష్ణ వంశీ గురించి చెప్పుకోవాలి. అతను ప్రతి కథలో ప్రతి పాత్రకు…. ముత్యాల్లాంటి మాటలు సమకూర్చారు. ఇవే సినిమాకి పెద్ద ప్లస్ అయ్యాయి. సామాన్యుడి జీవనం అస్తవ్యస్తమవుతున్నా కూడా ప్రభుత్వాలు అవేమి పట్టించుకోకుండా వారి ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటూ…. విగ్రహ రాజకీయాలు చేసుకుంటూ పోతూ ఉంటారు అన్న పాయింట్ ను కథాంశంగా సెలెక్ట్ చేసుకున్న దర్శకుడు తేజ ను నిజంగా అభినందించాలి. ఈ సినిమాకి పెద్ద బలం కథాంశమే. ఇక ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రజలకు ఎంతటి నష్టాన్ని చేకూరుస్తుంది అన్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు.. అందరికీ కనెక్ట్ అయ్యేలా చేశారు. మొదటి భాగం చాలా బాగుంది అనిపించినా రెండవ భాగం మాత్రం అందరూ ఊహించగలిగేలా రాసుకోవడంతో కాస్త బోరింగ్ గా వెళుతోంది. ఇక మళ్లీ క్లైమాక్స్ లో సినిమాలో కొద్దిగా మంచి ఫీల్ రావడంతో యావరేజ్‘ అన్న పదం తో బయట పడుతుంది. ఈ సినిమా మ్యూజిక్ వల్ల ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసి.. కొంచెం ఎమోషనల్ గా ఉండే వారి గుండె బరువెక్కి…. కళ్ళు చెమ్మగిల్లేలా చేస్తుంది కానీ అనవసర డ్రామా సినిమా లోని ఒరిజినల్ ఫ్లేవర్ ను దెబ్బతీసినట్లు అనిపిస్తుంది.

Teja Marni's 'Johaar' sound-mixing in full swing in London ...

ఇంతకీ చూడొచ్చా..?

చందమామ కథలు…. కేరాఫ్ కంచరపాలెం వంటి చిత్రాలను బాగా ఆరాధించిన వారు ఈ సినిమా లో ఉండే బోరింగ్ ను తట్టుకుంటే…. ఒక్కసారి చూడొచ్చు మాకు మూస సినిమాలంటే మోజు అన్న వారు మాత్రంఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి మరి.

న్యూస్ ఆర్బిట్ రేటింగ్ : 2.5/5

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N