‘అర్జున్ రెడ్డి’ తమిళ్ రీమేక్ సినిమాలో హీరోగా నటించిన కోలీవుడ్ స్టార్ నటుడు చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా ‘ఆదిత్య వర్మ’ తెరకెక్కిన విషయం తెలిసిందే. ధృవ్ మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు పొంగదా ఇప్పుదు అతను తన రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు. మురుగదాస్ దగ్గర సుదీర్ఘకాలంగా అసిస్టెంట్ గా పనిచేసిన రవికాంత్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ఈ సినిమాలో ఒక యంగ్ క్రేజీ హీరోయిన్ తో ధృవ్ రొమాన్స్ కి రెడీ అవుతున్నాడట.
ఏడాది క్రితం సోషల్ మీడియాలో చిన్నగా కన్నుగీటి దేశవ్యాప్తంగా కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ప్రియా ప్రకాష్ వారియర్ ధృవ్ సరసన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించబోతోందని సమాచారం. ఆమె సన్నగా కన్ను కొట్టిన వీడియో భారీగా పాపులర్ అయిన తర్వాత ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఆమె కావడం మరొక ఎత్తు.
అప్పుడు ఒకే సినిమాలో రెండు షాట్లతో ఆల్ ఇండియా స్టార్ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ తన రెండవ సినిమా శ్రీదేవి బంగ్లాలో నటించినా అది ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. ఇకపోతే కొద్ది రోజుల క్రితం ఆమె తెలుగులో నితిన్ సరసన నటించనుందని వినిపించింది. ఆ వార్త కూడా కనుమరుగైపోగా… ఇప్పుడు మాత్రం ధృవ్ సరసన ఆమెకు చాన్స్ రావడం మాత్రం చిన్న విషయం కాదనే చెప్పాలి.
ఇద్దరూ యుక్త వయస్సులో ఉండడంతో వీరి కాంబినేషన్ కుర్రకారుకు బాగా నచ్చుతుందని. నిర్మాతలు భావిస్తున్నారు. ఈసారి ప్రియ కనుక తన నటనతో అందరిని మెప్పిస్తే భారతదేశంలో మంచి స్టార్‌గా ఎదిగే అవకాశాలు ఆమెకు మెండుగా ఉన్నాయని అంటున్నారు.