NewsOrbit
న్యూస్

రాజకీయ ఇబ్బందుల్లో రోజా..! ఇక తేరుకోవడం కష్టమే..!!

roja facing problems in party

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా రాజకీయంగా చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయం అనుకున్నవారిలో రోజా ఒకరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబును, లోకేశ్ ను ఓ ఆట ఆడుకున్నారు. వైసీపీలో అన్ని వర్గాలకు బాగా దగ్గరయ్యారు. సినీ గ్లామర్, రాజకీయ పరిపక్వత ఆమెను రాష్ట్రస్థాయి నాయకురాలిగా మార్చేశాయి. పార్టీలో ప్రముఖ స్థానం ఉన్న రోజా సొంత జిల్లాలో పార్టీ ప్రముఖులతో పొసగకపోవడం ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.

roja facing problems in party
roja facing problems in party

రోజా బద్ద విరోధికి కార్పొరేషన్ పదవి..

రోజా వరుసగా 2014, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయంగా తనకు తిరుగులేదనే అనుకున్నారు. మంత్రి పదవి వస్తే జిల్లాలో తిరుగులేని నాయకురాలిగా ఎదగాలని, టీడీపీని ఓ ఆట ఆడుకుందామనుకున్న రోజాకు నగరిలోనూ జిల్లాలోనూ శత్రువులు అయ్యారు. జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, రోజాకు బద్ద శత్రువు కేజే కుమార్ భార్య కె.శాంతికి ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని వెనుక ఆ మంత్రి స్కెచ్ ఉందని అంటున్నారు. కేజే కుమార్ కు రోజాకు గతంలో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే.. పార్టీ అధికారంలోకి వచ్చాక వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. కుమార్ ఇంట్లోని శుభకార్యానికి పార్టీ నాయకులు వెళ్లొద్దంటూ ఓ వీడియోనే విడుదల చేసే స్థాయికి విబేధాలు పెరిగాయి. ఇప్పుడు ఆయన భార్యకే కార్పొరేషన్ పదవి దక్కడం రోజాకు చెక్ పడినట్టేనా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

రోజా అడుగులు ఎటువైపు..

తన ప్రత్యర్ధులను పార్టీలో అందలం ఎక్కించడం, జిల్లాలో తన హవా నడవకుండా ఆ సీనియర్ మంత్రి చక్రం తిప్పడంతో రోజా పార్టీలో ఇమడలేకపోతున్నారు. అయితే.. పార్టీపై ముఖ్యంగా జగన్ పై ఉన్న అభిమానంతో రోజా పార్టీకి దూరమయ్యే అవకాశం లేదు. దీంతో ఆమె పూర్తిగా సైలంట్ అయ్యారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ విబేధాలు తగ్గిపోతాయనే భావిస్తున్నారట. అలా కాని పక్షంలో ఏదొక నిర్ణయం తీసుకుని ఆ మంత్రికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆలోచిస్తున్నారట. కొసమెరుపు ఏంటంటే.. ఈ సీనియర్ మంత్రి అంటే జగన్ కు బాగా గురి. దీంతో రోజా మాటలు జగన్ వరకూ వెళ్లడం లేదని తెలుస్తోంది.

 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?