మోటోరోలా కంపెనీ తన రేజర్ 5జి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ను భారత్ లో సోమవారం విడుదల చేసింది. ఇందులో 6.2 ఇంచుల ఫ్లెక్సిబుల్ ఓలెడ్ డిస్ప్లేను ఇచ్చారు. దీన్ని సగానికి మడతబెట్టవచ్చు. 2 లక్షల సార్లు మడతబెట్టినా ఈ ఫోన్‌కు ఏమీ కాని విధంగా అత్యంత మన్నికగా దీన్ని రూపొందించారు. అలాగే ఫోన్‌పై ఎలాంటి స్క్రాచ్‌లు, గీతలు పడకుండా ప్రత్యేక కోటింగ్ ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్లో 2.7 ఇంచుల ఓలెడ్ క్విక్ వ్యూ డిస్ప్లేను ఇచ్చారు. దీనిపై మెసేజ్‌లు, నోటిఫికేషన్లు చూసుకోవచ్చు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగన్ 765జి ప్రాసెసర్‌ను ఇందులో ఇచ్చారు. అందువల్ల 5జికి సపోర్ట్ లభిస్తుంది. 8జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. 256 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను ఇచ్చారు. మెమొరీ కార్డును వేసుకునేందుకు వీలు లేదు. రెండు సిమ్‌లను మాత్రమే వేసుకోవచ్చు. 1 సిమ్ ఇ-సిమ్ తరహాలో పనిచేస్తుంది.
వెనుక వైపు 48 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. వెనుక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈకి ఇందులో సపోర్ట్ లభిస్తుంది. బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి ఫీచర్లను ఇచ్చారు. ఈ ఫోన్లో 2800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌ను ఇచ్చారు. అందువల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది.
ఇక ధర విషయానికి వస్తే ఈ ఫోన్ రూ.1,24,999 కు అక్టోబర్ 12 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం కానుంది. దీన్ని ఇప్పటికే ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ కార్డులతో ఈ ఫోన్‌ను కొంటే రూ.10వేలు ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు. జియో కస్టమర్లకు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.4,999 విలువైన ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి. 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలోనూ ఈ ఫోన్‌ను కొనవచ్చు.