కాజల్ అగర్వాల్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందానికి అందం.. నటనకు నటన.. అదృష్టానికి అదృష్టం. అన్ని కలగలసిన భామే కాజల్ అగర్వాల్. ఎంతో తెలివి ఒక్కో సినిమా తీస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ఈ నటి అక్టోబర్ 30వ తేదీన పెళ్లి చేసుకోనుంది.
ఇక ఈ విషయాన్నీ కాజల్ ఏ ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. బిజినెస్ మ్యాన్ అయినా గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని పెళ్లి చేసుకోనుంది. అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నట్టు కాజల్ ప్రకటించింది. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ లో సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా లేని కాజు పాప ఎంగేజ్మెంట్ చేసుకుందని వార్తలు వచ్చినప్పటికీ క్లారిటీ లేదు. కానీ నిన్న ఆమె చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.
అయితే కాజల్ అగర్వాల్ 14 ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎక్కడ కూడా ఆమె గురించి వార్తలు చెడుగా రాలేదు. కానీ ఇటీవల తేజ దర్శకత్వంలో వచ్చిన సీత సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయినప్పటికీ ఆ సినిమా హీరోను ప్రేమలో పడేసిందని వార్తలు ఓ రేంజ్ లో వినిపించాయ్. త్వరలోనే ఆ టాప్ హీరోకి కాజు పాపకు పెళ్లి అని కూడా ఇండస్ట్రీలో గుస గుసలు వినిపించాయ్.
కానీ కాజల్ అగర్వాల్ ఆ గాసిప్స్ కి చెక్ పెట్టేసింది. ఆమె పెళ్లి చేసుకోబోయేది బిజినెస్ మ్యాన్ అని చెప్పేసింది. దీంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ లో ఉన్నప్పటికి కాజల్ అభిమానులు మాత్రం నిరాశలో ఉన్నారు. ఏంటి కాజు పాప ఒకటి అనుకుంటే మరొకటి చేశావ్.. అప్పుడే నీకు పెళ్లి అవసరమా ? అంత వయసు ఏం వచ్చింది నీకు అంటూ కామెంట్స్ చేస్తూ వారి బాధను చెప్పుకుంటున్నారు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!