చిన్నపిల్లలు అయినా పెద్ద వారు అయినా ఏడిస్తే కంట్లో నుంచి నీరే వస్తుంది కానీ ఇక్కడ మాత్రం విచిత్రం. ఓ బాలిక కంటిలో నుంచి రక్తం వస్తుంది. మామూలుగా ఏదైనా వేడిమి ఉంటే లేదా ఏదైనా గాయమైతే చెవి, ముక్కు, నోటీ నుండి రక్తం వచ్చే సంగతి అందరికీ తెలుసు కానీ ఈ బాలికకు కన్నీటి బదులు రక్తం ఎందుకు వస్తుందో వైద్యులకు కూడా అర్థం కాని పరిస్థితి గా మారింది. నిజంగానే ఇది విచిత్రమైన వ్యాధి ఏమో.. మరి ఇలా ఎందుకు వస్తుందో ఎలాంటి చికిత్స ఉంటుందో తెలుసుకుందాం.
బ్రెజిల్ కు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక చిన్నప్పటి నుండి ఎలాంటి అనారోగ్యాల సమస్యలకు గురి కాలేదు. కానీ అకస్మాత్తుగా పొత్తి కడుపు నొప్పితో బాధ పడగా ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చారు. దీంతో ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పగా ఆమెకు చికిత్స ఇచ్చారు. ఇదిలా ఉండగా మరుసటిరోజు తన ఎడమ కంటి నుంచి రక్తం రావడం మొదలైంది.
అయితే కంటి నుంచి రక్తం వస్తున్నప్పటికీ ఎటువంటి నొప్పి లేకపోవడంతో ఎలాంటి పరీక్షలు చేసినా ఏమి తెలియకపోవడంతో ఆమెకు చికిత్స అందించడం ఆపేశారు. బాలికకు ఏకంగా తన రెండు కళ్ళలో నుంచి రక్తం కారడంతో ప్రముఖ కంటి వైద్యుడు రాఫెల్ ఆంటోనీయో బార్బోసా డెల్సిన్ఈ సమస్యను పరీక్షించగా దీని గురించి మెడికల్ లిటరేచర్ లో ఉందని, ఇలా కొందరిలో మాత్రమే అరుదుగా జరుగుతుందని దీనికి చికిత్స చేయడానికి లేదని దానంతట అదే తగ్గుతుందని తెలిపారు.
ప్రత్యేకించి అయితే కారణం లేకున్నా యాంటీ బయోటిక్స్ తో చికిత్స అందించే అవకాశం ఉందని తెలిపారు. ఇది కేవలం ఆరోగ్య సమస్య వల్ల, శరీరంలో ఉన్న వేడిమి వల్ల చెవి, ముక్కు నుండి కాకుండా కళ్ళల్లో అరుదుగా జరుగుతుందని తెలిపారు. కాగా ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు తెలిపారు.