NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

స్పీకర్ స్పీడుతో సీఎం జగన్ కి ఇబ్బందులు?

అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ నోటిదురుసుతనం కారణంగా జగన్ ప్రభుత్వానికి కొత్త ఇబ్బందులు వస్తున్నాయని వైసిపి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.వైసీపీ పార్టీకి పంటికింద రాయిలాగ మారిన నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ ప్రభుత్వానికి రోజుకో సవాల్ విసురుతున్నారు.

తాజాగా ఆయన మూడు రాజధానులకు ప్రజామోదం ఉందని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లయితే దాన్ని ప్రధానాంశంగా పెట్టుకుని రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అమరావతి అంశంపై గనుక రెఫరెండం నిర్వహించినట్లయితే తాను వైసీపీ నుండి వైదొలుగుతానని రఘురామకృష్ణంరాజు చెప్పారు .యధా ప్రకారం సీఎం జగన్ దీనిపై ఏ విధంగానూ స్పందించలేదు. అయితే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం రఘురామకృష్ణంరాజు సవాల్ ను స్వీకరిస్తున్న ధోరణిలో మాట్లాడారని సమాచారం.

ఆయన ఇటీవల మీడియా చిట్చాట్లో మాట్లాడుతూ ‘మేము విశాఖపట్నంలో రాజధానిని పెట్టాలనుకుంటున్నాం… ప్రతిపక్షాలు అమరావతిలో ఉంచాలంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజాభిప్రాయ సేకరణ అంటే రెఫరెండమే ఉత్తమం..ఇందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ‘అని స్పీకర్ వ్యాఖ్యానించటం జరిగింది .ఎన్నికలంటే భయపడాల్సిన అవసరమేమీ లేదు.. మూడు రాజధానులకు అమరావతినుంచి విశాఖకు రాజధాని తరలింపునకు రాష్ట్ర ప్రజలు సుముఖంగా ఉన్నారని కూడా స్పీకర్ పేర్కొనడం వైసిపి వర్గాలకు మింగుడు పడడం లేదంట. అమరావతి ప్రధానాంశంగా ఒకవేళ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలనుకొంటే అది జగన్ స్థాయిలో తీసుకోవలసిన నిర్ణయమని,అందులో స్పీకర్ ఎందుకు వేలు పెట్టడమని వైసీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇంతకు ముందే స్పీకర్ సీతారామ్ న్యాయ వ్యవస్థపైనా కోర్టుల పైన కూడా దుందుడుకు విమర్శలు చేసి కేసులో కూడా ఇరుక్కున్నారు.కోర్టులు న్యాయమూర్తులు రాష్ట్రాన్ని పాలించ దలుచుకుంటే ఇక ముఖ్యమంత్రి ,ప్రభుత్వాలు ఎందుకని స్పీకర్ ధ్వజమెత్తడం తెలిసిందే.కోర్టు హాలు నుండి ఈ రాష్ట్రాన్ని వారు పాలించదలుచు కున్నారా అని కూడా న్యాయమూర్తులను స్పీకర్ నిలదీశారు. ఈ తరహా లో స్పీకర్తో సహా పలువురు వైసీపీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కోర్టులపై చేసిన వ్యాఖ్యలపై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం తెలిసిందే.ఏదేమైనా తమ్మినేని కారణంగా వైసిపి ప్రభుత్వం అప్పుడప్పుడు ఇరకాటంలో పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N