NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

సీఎం జగన్ X జస్టిస్ రమణ పోరులో బీజేపీ మౌనం..! తెర వెనుక భయానక వ్యూహం.! పార్ట్ 1

YS Jagan Future will decide by this march 5?

(నోట్ ; ఉన్నత స్థాయిలో రాజకీయ, న్యాయ తటస్థ వర్గాల్లో “న్యూస్ ఆర్బిట్” కి ఉన్న సోర్సుల ద్వారా సమాచారం సేకరించి, కొన్ని పాయింట్స్ ఆధారంగా ఈ కథనం ఇస్తున్నాం..! సీఎం జగన్ X జస్టిస్ రమణ విషయంలో బీజేపీ పాత్రపై రెండు భాగాల్లో కథనం ప్రచురిస్తున్నాం. మొదటిది సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తి కుర్చీ కోసం బీజేపీ పన్నిన వ్యూహం..! రెండోది దీనిలో బీజేపీకి కలిగే ప్రయోజనాలు, జగన్ పాత్ర చెప్పుకుందాం)..!!

సింపుల్ గా ఇదీ ప్లాన్..!!

ఏపీలో సీఎం జగన్ X న్యాయవ్యవస్థగా మొదలైన పోరు ఢిల్లీ స్థాయికి చేరింది. సీఎం జగన్ X జస్టిస్ రమణ మధ్య పోరుగా మారింది. దీనిలో ఎవరిది తప్పు.., ఎవరిది ఒప్పు అనేది పక్కన పెట్టి “సుప్రీమ్ చీఫ్ జస్టిస్” అనే కుర్చీ చుట్టూ బీజేపీ వేసిన పన్నాగం ఏమిటి..? వారి ప్రయోజనాలు ఏమిటి..? అనేది మాత్రం చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్న చీఫ్ జస్టిస్ శరద్ అరవింద్ బొబ్దే వచ్చే ఏడాది ఏప్రిల్ 23 న పదవీ విరమణ చేస్తారు. ఆ తర్వాత సీనియారిటీ జాబితా ప్రకారం వరుసగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ, జస్టిస్ రోహింటన్ ఫలి నారీమన్, జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ఉన్నారు. అంటే ప్రస్తుత సీజే దిగిన వెంటనే రమణ ఆ స్థానానికి వెళ్లనున్నారు. ఇక్కడ రమణని ఆపేసి, లలిత్ ని ఆ స్థానానికి తీసుకువెళ్ళాలి అనేది ఒక ప్లాన్.

* జస్టిస్ రమణ ఒకవేళ సీజే స్థానానికి వెళ్తే 2021 ఏప్రిల్ నుండి 2022 ఆగష్టు వరకు అంటే 16 నెలలు ఆ కుర్చీలో కొనసాగనున్నారు. ఆ స్థానానికి జస్టిస్ రమణ వెళ్లకపోతే నారీమన్ వెళ్తారు. ఈయన నాలుగు నెలలు మాత్రమే అంటే 2021 ఆగష్టు వరకు మాత్రమే ఉంటారు. తర్వాత లలిత్ వస్తే 16 నెలలు ( 2022 నవంబరు వరకు) ఆ స్థానాల్లో ఉండనున్నారు. అంటే రమణ, లలిత్ ఇద్దరిలో ఎవరో ఒకరికే ఎక్కువ కాలం చీఫ్ జస్టిస్ అవకాశం దక్కనుంది అనేది మాత్రం పక్కా. ఒకవేళ ఆర్దర్ ప్రకారమే రమణ సీజే అయ్యి, ఆ తర్వాత లలిత్ అవ్వాలంటే రమణ 2022 ఆగష్టు 26 న రిటైర్ అయినా తర్వాత లలిత్ చీఫ్ జస్టిస్ అయినా ఆయన ఉండేది రెండున్నర నెలలు మాత్రమే. అంటే 2022 ఆగష్టు 27 నుండి నవంబర్ 8 వరకు మాత్రమే. అందుకే రమణని తప్పిస్తే లలిత్ ఎక్కువ కాలం సీజేగా ఉంచొచ్చు..!!

Read Also >> సీఎం జగన్ X జస్టిస్ రమణ పోరులో బీజేపీ మౌనం..! వెనుక భయానక వ్యూహం.! (పార్ట్ – 2 )

ఎవరీ ఉదయ ఉమేష్ లలిత్..!?

2014 ఆగష్టులో సుప్రీమ్ కోర్టుకి జడ్జిగా వచ్చారు. అంటేఎన్డీయే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఢిల్లీ స్థాయికి వచ్చేసారు. అంతకు ముందు ఈయన సోబ్రబుద్ధిన్ షేక్.., తులసీ ప్రజాపతి ఎన్కౌంటర్ కేసులో అమిత్ షా తరపున లాయర్ గా ఉన్నారు. ఆ కేసుల్లో అమిత్ షా కి క్లీన్ చీట్ వచ్చింది. అంతే కాకుండా బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ తరపునా లాయర్ గా ఉన్నారు. ఇంకా అనేక కేసుల్లో ఈయన కీలకంగా పనిచేసారు. సో.., బీజేపీకి, అమిత్ షా కి ఈ ఉదయ్ ఉమేష్ లలిత్ ఎంత ముఖ్యమో.., ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

బీజేపీ వ్యూహం ఇదీ..!?

పైన చెప్పిన రెండు అంశాలు పక్కాగా అర్ధం చేసుకుంటే సుప్రీమ్ చీఫ్ జస్టిస్ కుర్చీ విషయంలో బీజేపీ గేమ్ అర్ధమైనట్టే. జస్టిస్ లలిత్ ఆ కుర్చీ ఎక్కాలంటే జస్టిస్ రమణ అడ్డం. సో.., జగన్ ఇచ్చిన ఈ పిర్యాదు ఆధారంగా.. ఈ ఫిర్యాదులో ఏ ఒక్క అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నా రమణని పక్కన పెట్టేయొచ్చు. తర్వాత ఆ కుర్చీలోకి తమ అనుయాయులను (లలిత్) ఎక్కించడం పెద్ద కష్టమేమి కాదు. అంటే ఇక్కడ అమిత్ షాకి, బీజేపీకి తన లాయర్ గా పని చేసిన లలిత్ ని సీజేగా చేయడం ఎంత ముఖ్యమో.. జస్టిస్ రమణ ఆ స్థానానికి రాకుండా చేయడం కూడా అంతే ముఖ్యం. అదే బీజేపీ ప్లాన్. తెరవెనుక వ్యూహం..!!
(దీనికి పర్యావసానంగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి కలిగే రాజకీయ ప్రయోజనాలు, దేశ వ్యాప్తంగా కీలక అంశాలు.., దీనిలో జగన్ పాత్ర, చంద్రబాబుకి కలిగే నష్టం.. మొత్తం వివరాలు రేపు ఉదయం 6 గంటలకు చెప్పుకుందాం..!)

Read Also >> సీఎం జగన్ X జస్టిస్ రమణ పోరులో బీజేపీ మౌనం..! వెనుక భయానక వ్యూహం.! (పార్ట్ – 2 )

Related posts

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju