NewsOrbit
బిగ్ స్టోరీ సినిమా

ఈ వెబ్ సిరీస్ చూసి జనాల మతి పోతుంది..! ఇండియాలోనే టాప్ అట

భారతదేశంలో వెబ్ సిరీస్ పర్వం ఇంకా అంతగా ఊపు అందుకోలేదు అనే చెప్పాలి. ఒక నాలుగేళ్ల కిందటే ఈ వెబ్ సిరీస్ మన దేశంలో అడుగు పెట్టినప్పటికీ పూర్తిస్థాయిలో ప్రేక్షకాదరణ లభించలేదు. ఇక లాక్ డౌన్ టైంలోనే దీని ప్రాధాన్యత ఏమిటో అందరికీ తెలిసి వచ్చింది. ఒక్కసారిగా డబ్బులు కట్టేసి ఇంటిలోనే నెలంతా లేదా సంవత్సరం మొత్తం కూర్చుని ఇష్టం వచ్చిన సినిమాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడవచ్చు. గతంలో వీటిని తక్కువ చూసేవారు కాస్త ఇప్పుడు తమ ఆలోచనలు మార్చుకున్నారు. ఇదంతా ఎందుకు చెబుతున్నాం అన్నది మరికొద్ది ముందుకు వెళ్తే తెలుస్తుంది….

 

ఇవే భవిష్యత్తా…?

ఇప్పటి వరకు భారత దేశంలో ఎన్నో వెబ్ సిరీస్ లు రూపొందించబడ్డాయి. స్టార్ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తమ పాత్రలను మార్చుకుని ఈ రంగం లోకి అడుగుపెట్టారు. వివిధ భాషల్లో పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు సైతం వెబ్ సిరీస్ ల పట్ల తమ ఆసక్తిని చూపిస్తున్నారు. కరోనా చిత్ర పరిశ్రమ రంగాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో దాని ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మరో వైపు వెబ్ సిరీస్ లలో క్వాలిటీ కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. సినిమాలకు ఏ మాత్రం తీసిపోని కంటెంట్, టేకింగ్ తో ఇవి ప్రజలను బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాయి.

 

కుంభకోణంతో కుంభస్థలినే కొట్టారు….

ఇక క్వాలిటీ విషయంలో, కంటెంట్ విషయంలో లో స్టాండర్డ్ తో తాజాగా ఒక వెబ్ సిరీస్ వచ్చింది. అదే స్కామ్ 1992. 90వ దశకంలో స్టాక్ మార్కెట్ కుంభకోణంతో దేశంలో పెద్ద సంచలనం రేపిన హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే ఎంతో మంది ప్రశంసలు అందుకుంది. సిటీ లైట్స్, అలీగఢ్, షాహిద్ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ఎంతో పేరు తెచ్చుకున్న సీనియర్ దర్శకుడు హన్సల్ మెహతా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించాడు.

 

ఈ స్క్రిప్ట్ తీసుకొని పాఠాలు చెప్పొచ్చు….

ఇక్కడ విశేషమేమిటంటే అసలు అంచనాలు లేకుండా సోనీ లైవ్ యాప్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన రాబట్టుకుంది. చూసినవారంతా దీనిని మాస్టర్ పీస్ గా అభివర్ణిస్తున్నారు. ఇప్పటివరకు భారత దేశంలో పదుల సంఖ్యలో భారీ వెబ్ సిరీస్ లు విడుదలయ్యాయి. వందల సంఖ్యలో రూపొందుతున్నాయి కానీ ప్రస్తుతం వరకు ఇదే ది బెస్ట్ అని క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక బాలీవుడ్ క్రిటిక్అ యితే ఈ వెబ్సైట్ స్క్రిప్ట్ తో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో క్లాసులు చెప్పాలని వ్యాఖ్యానించాడు.

ఇప్పటివరకు వెబ్ సిరీస్ లు అంటే…. మిర్జాపూర్, ఫ్యామిలీ మాన్, సేక్రెడ్ గేమ్స్, పంచాయత్, కోట ఫ్యాక్టరీ భారతదేశంలో టాప్ వెబ్ సిరీస్ లు గా వినిపించేవి. అయితే ఇప్పుడు మాత్రం వాటన్నింటిని దాటుకుని స్కామ్ 1992 ఎక్కడికో వెళ్లిపోయిందట.

Related posts

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri