NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రమణా! నువ్వే లోడ్ ఎత్తాలి అన్న చంద్రబాబు! తెలంగాణలో తెల్లమొహం వేసిన తెలుగు తమ్ముళ్లు!!

ఆంధ్రప్రదేశ్లో ఆరేళ్లలో ఇద్దరు టిడిపి రాష్ట్ర అధ్యక్షులను మార్చిన చంద్రబాబు నాయుడు తెలంగాణ విషయానికొచ్చేసరికి మాత్రం పాత అధ్యక్షుడినే కొనసాగిస్తున్నారు.

chandrababu  strategy fails in telangana
chandrababu strategy fails in telangana

బి.సి కాన్సెప్ట్ నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్నప్పటికీ రమణ వల్ల తెలంగాణలో ఆ పార్టీ పెద్దగా బలోపేతం అయ్యే సూచనలే గోచరించడం లేదని టిడిపి వర్గాలు పెదవి విరుస్తున్నాయి నిజమే ఒకప్పుడు తెలంగాణాలో బీసీలు టీడీపీకి పెట్టని కోట.పదవుల 1999 లో చంద్రబాబు సొంతంగా అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణలో వచ్చిన సీట్లు ఆయనకు బాగా ప్లస్ అయ్యాయి.అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ మనుగడకే ప్రమాదం వాటిల్లింది.2014 ఎన్నికల్లో పదిహేను అసెంబ్లీ సీట్లు సంపాదించుకున టీడీపీ బలం 2019 నాటికి రెండు కు పడిపోయింది. లోక్సభ ఎన్నికల్లో అయితే అసలు ఖాతానే తెరవలేదు.

chandrababu  strategy fails in telangana
chandrababu strategy fails in telangana

ఇక నూటయాభై సీట్లు ఉన్న హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపికి ఒకే ఒక్క డివిజన్ లభించింది. విభజన తదుపరి తెలంగాణలో పూర్తిగా వైభవం కోల్పోయిన టిడిపి నుంచి సీనియర్ లీడర్లు దాదాపుగా వెళ్లిపోయారు. మిగిలిన కొద్ది మంది కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పార్టిసిపేట్ చేయడం లేదు. అంటే తెలంగాణలో పార్టీ కార్యక్రమాలకు కూడా పెద్దగా లేవనే చెప్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణలో ప్రస్తుతం టీడీపీ ఉనికి ప్రశ్నార్థకం.అయినప్పటికీ జాతీయ పార్టీగా కూడా చెప్పుకుంటున్న టీడీపీ తెలంగాణలో తన తన మార్కు చూపెట్టడానికి ఆరాటపడుతోంది.కానీ గత ఆరేళ్లుగా తెలంగాణ టీడిపి చీఫ్ గా ఉన్న రమణ వల్ల పార్టీ పుంజుకున్నది లేదన్నది నిర్వివాదాంశం.అయినప్పటికీ ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించటం పార్టీ వర్గాలకు నచ్చలేదు. యువరక్తాన్ని పార్టీ లో నింపాలని పలువురు టీడీపీ నేతలు సూచించినప్పటికీ చంద్రబాబు రమణ వైపే మొగ్గు చూపారు.

ఆంధ్రప్రదేశ్లో ముందుగా కళా వెంకట్రావును తాజాగా అచ్చెన్నాయుడును పార్టీ అధ్యక్షులను చేసిన చంద్రబాబు తెలంగాణలో రమణను కొనసాగించారు. అచ్చెన్నాయుడు విషయంలో ఆంధ్రప్రదేశ్లో టిడిపి శ్రేణులు సానుకూలంగా ఉన్నాయి.ఆయన ఆ పదవికి తగిన వారేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.కానీ తెలంగాణలో మాత్రం రమణకు టిడిపి వర్గాల నుండి వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి!

Related posts

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?