NewsOrbit
రాజ‌కీయాలు

సీఎం జగన్ × న్యాయవ్యవస్థ: మొదటి వికెట్ పడినట్టేనా..!?

cm jagan vs judiciary over amaravathi

చట్టానికి ఎవరూ చుట్టం కారనేది నిజం. కొన్నేళ్ల క్రితం గాలి జనార్ధన్ రెడ్డి విషయంలో 10 కోట్లు లంచం తీసుకుని బెయిల్ మంజూరు చేసిన జడ్జినే అరెస్టు చేశారు. దీనిని సాక్ష్యాలతో సహా నిరూపించింది కూడా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కావడం విశేషం. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తిపైనే చట్టం తన పని తాను చేసింది. వారి పిల్లలు, బంధువుల విషయంలో ఎందుకు వ్యతిరేకంగా పని చేస్తుంది? ఏపీ సీఎం జగన్ న్యాయ వ్యవస్థతో పోరాటానికి దిగిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యులకు సంబంధించి అమరావతిలో జరిగిన లావాదేవీలను బయటకు తీసి వాటిని ఆరోపణల రూపంలో సీజేఐకి అందించారు కూడా. ఈ లావాదేవీలు బ్యాంకు సిబ్బంది ద్వారానే బయటకు వచ్చాయనే ఆరోపణలతో వారిపై బదిలీ వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే..

cm jagan vs judiciary over amaravathi
cm jagan vs judiciary over amaravathi

ప్రభుత్వమే చేసిన ఆరోపణలు

అమరావతిలో భూకుంభకోణం జరిగిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. టీడీపీతో అనుబంధంగా ఉన్న న్యాయ విభాగంలోని పెద్దలు కొందరు.. వారి సన్నిహితులు కొందరు భూములు పొందారనేది వైసీపీ ప్రభుత్వం ఆరోపణ. ఈ నేపథ్యంలో జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబసభ్యులు భూములు పొందారని సీఎం జగన్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు వెనుక ఆధారాలుగా చూపిన బ్యాంకు లావాదేవీలు ఎలా బయటకు వచ్చాయని ఆరా తీసి సదరు బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. ఏసీబీ అడిగిన వివరాలు ఇచ్చిన బ్యాంకు అధికారులే బాధితులుగా మారారు. ఉన్నతాధికారులపై ఒత్తిడి పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

వివరాలు ఇవ్వడమే తప్పైంది..

అమరావతి భూకుంభకోణం విషయంలో బ్యాంకు లావాదేవీల వివరాలు ఇచ్చిన ఐదుగురిపై పనిష్మెంట్ బదిలీ పడింది. ముగ్గరు చెన్నైకు ఇద్దరు ముంబైకు బదిలీ చేశారు. దీనిపై యూనియన్లు కూడా ఏం మాట్లాడటం లేదు. షెడ్యూల్ ప్రకారం బదిలీలు జరిగే బ్యాంకుల్లో తప్పు చేయకపోయినా ఇలా హఠాత్తుగా బదిలీ చేయడం.. వారిలో ఇద్దరు మహిళా ఉద్యోగులు ఉండటంతో అసంతృప్తి రగులుతోంది. వారివైపు చట్టం ఒకలా.. మావైపు చట్టం మరొకలా ఉంటుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై బ్యాంకు ఉన్నతాధికారులే సమాధానం చెప్పుకోవాలి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న అనేకమంది న్యాయ నిపుణులు ఇందులోని వాస్తవాలు గ్రహంచాలనే వాదనలూ వస్తున్నాయి.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?