NewsOrbit
రాజ‌కీయాలు

ఏపీలో బయటపడిన పెద్ద స్కామ్..! అనాధల పేరిట నిధుల దోపిడీ..!!

big scam in ap extortion of funds for orphans

దేశంలో అనాధలుగా మిగిలిపోయిన పిల్లలు ఎందరో ఉన్నారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువులు చెత్త కుప్పల్లో పడి అనాధలవుతున్న వారి సంఖ్యకు లెక్కే లేదు. వీరిని ఆదుకునేందుకు దేశంలో ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి. చదువు, ఆహారం, ఆరోగ్యం, వసతి.. సదుపాయాలు కల్పించే ఎన్జీవో సంస్థలకు కొదవ లేదు. అటువంటి చిన్నారులపై జాలి, అక్కున చేర్చుకున్న ఎన్జీవో సంస్థలపై గౌరవం పెరుగుతాయి. మన వంతుగా సాయం చేయాలనే ఆలోచనా వస్తుంది. విరాళాలూ వస్తాయి. అయితే.. దీనిక వెనుక అక్రమాలు జరుగుతున్నాయని.. తెలుగు రాష్ట్రాలే తొలి రెండు స్థానాల్లో ఉన్నాయని జాతీయ బాలల హక్కుల కమిషన్ గణాంకాలే చెప్తే.. ఆ సంస్థలపై కోపం తెచ్చుకోవాలా.. తలదించుకుని సిగ్గు పడాలా..?

big scam in ap extortion of funds for orphans
big scam in ap extortion of funds for orphans

వచ్చేది ఇంత.. ఖర్చ పెట్టేది అంతా..?

అనాధల కోసం విరాళాలివ్వండి.. వారిని ఆదుకోండి.. అంటూ ఎన్నో ఎన్జీవో సంస్థలను చూస్తూంటాం. దేశ విదేశాల నుంచి కూడా విరివిగా విరాళాలు వస్తూంటాయి. పిల్లల కోసం.. అని దాతలు వారి కోసం విరాళాలు ఇస్తుంటే.. వాటిని వీరు స్వలాభంతో జేబుల్లోకి మళ్లించుకుంటున్నారు. జాతీయ బాలల హక్కుల కమిషన్ లెక్కల ప్రకారం ఒక్క ఏపీలోనే ఒక్కో చిన్నారి కోసం ఏటా 6లక్షల 60వేలు విరాళంగా వస్తోంది. కానీ.. ఈ సంస్థలు వారి కోసం ఖర్చు చేస్తోంది కేవలం 60వేల లోపే. జాతీయ గణాంకాలే ఇలా చెప్తుంటే.. ఎవరిని నమ్మాలి అనే ప్రశ్న వస్తుంది. చిన్నారులను చూపించి కొందరు అక్రమార్కులు చేస్తున్న ఈ వ్యవహారం ఓ దందాగా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. చిన్నారుల కోసం వీరేం చేస్తున్నారనే ప్రశ్నా రాక మానదు.

తెలుగు రాష్ట్రాలదే టాప్ పొజిషన్..

దేశంలోని 5 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన బాలల హక్కుల కమిషన్ ఈ నివేదక ఇచ్చింది. ఈ అక్రమాల్లో ఏపీ నెంబర్ వన్ గా నిలవడం సిగ్గు పడాల్సిన విషయం. తర్వాతి స్థానాల్లో వరుసగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ దందా కొనసాగిస్తున్నాయి. సంస్థలపై నమ్మకంతో ఇస్తున్న విరాళాలు ఇలా సొంత ఖాతాల్లోకి మళ్లించుకోవడం దుర్మార్గం. ఈ అక్రమాలు సాయం చేసేవారి ఆలోచనలను మార్చేస్తాయి. అది చిన్నారుల భవిష్యత్తుకు మంచిది కాదు. ఈ మొత్తం చిన్నారుల జీవితాలకు బాటలు వేయాలి కానీ.. అక్రమార్కుల జేబులు నిండడం కోసం కాదు. ఈ అక్రమాల నిగ్గు తేల్చి దాతలకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత బాలల హక్కుల కమిషన్ దే.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!